info.manatemples@mail.com

+91 9866933582

ఆలయప్రవేశం ముందు ఏం చేయాలి....?

చాలా మంది మహిళలు ఆవును పూజిస్తుంటారు. ముఖ్యంగా కొత్త ఇంటి గృహ ప్రవేశానికి గోవును తీసుకొచ్చి, నడి ఇంట్లో ఉంచి దంపతులిద్దరూ పూజలు చేస్తుంటారు. అసలు గోమాతను ఎందుకు పూజిస్తారన్న అంశాన్ని తెలుసుకుందాం.
పవిత్రమైన ఆవును సాక్షాత్ విరాట్ స్వరూపంతో పోలుస్తారు. ఆవు ముఖంలో వేదాలు, కొమ్ముల్లో శివకేశవులు, చివర ఇంద్రుడు, నుదురులో ఈశ్వరుడు, చెవుల్లో అశ్వినీ దేవతలు, కన్నుల్లో సూర్యచంద్రులు, కొలువుంటారని ప్రతీతి.
అదేవిధంగా దంతాల్లో గరుత్మంతుడు, నాలుకపై సరస్వతి, పూర్వభాగంలో యముడు, ఉదరంలో స్కందుడు, పశ్చిమభాగంలో అగ్ని, దక్షిణ భాగంలో వరుణుడు, కుబేరుడు, ఎడమ వైపు భాగంలో యక్షులు, ముఖంలో గంధర్వులు కొలువై ఉంటారట.
అన్నిటికంటే ముఖ్యంగా గోమయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. దేవతలందరూ కొలువు ఉండే గోమాతను పూజిస్తే అందరినీ పూజించినట్లే అవుతుందని వేదాంత పండితులు చెపుతున్నారు.