info.manatemples@mail.com

+91 9866933582

ఝర్ణీ నరసింహక్షేత్రం




మనదేశం ఆత్యాధ్మిక నిలయం.మనస్సు ప్రశాంతంగా వుండటానికి మనము ఆలయాలను సందర్శిస్తూవుంటాం. అటువంటి ఆలయాలలో తప్పకుండా దర్శించుకొనవలసిన క్షేత్రం ఝరణీ నరసింహక్షేత్రం.క్రీ.పూ 400 ల సం ల క్రితం ఈ క్షేత్రంలో స్వామివారు కొలువైవున్నారని చెబుతున్నారు.మన దేశంలోని అన్ని ఆలయాల కన్నా ఈ క్షేత్రం దర్శించుకోటానికి ఒక ప్రత్యేకత వుంది.చుట్టూ కొండలు పచ్చని ప్రశాంతవంతమైన వాతావరణం నడుమ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ కు దగ్గరలో గల మంగళ్ పేట్ లో నరసింహక్షేత్రం వెలసింది.
ఒక గుహలో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్లి గర్భగుడిలో కొలువైనటువంటి ఝరణీ నరసింహస్వామిని దర్శించుకోవాలి.ఒక గుహలో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్లి గర్భగుడిలో కొలువైనటువంటి ఝరణీ నరసింహస్వామిని దర్శించుకోవాలి.
అయితే పురాణాల ఇతిహాసాల ప్రకారం ఈ గుహలో జలాసురుడు అనే రాక్షసుడు రాగా లక్ష్మీనరసింహుడు వచ్చి రాక్షసుడ్ని సంహరిస్తూవుండగా తన చివరి కోరికగా లక్ష్మీనరసింహుడుని ఇక్కడే కొలువుండాలని కోరాడట. జలా అంటే నీరు కాబట్టి , నరసింహ స్వామి పాదాల వద్ద నుంచి నీరు ఆ గుహలో ప్రవహిస్తోందిట. ఇలా 600 మీటర్ల లోపలికి నీటిగుండా ప్రయాణం చేస్తే కానీ జాలా నరసింహుని సందర్శన సాధ్యం కాదు. జీవిత కాలం లో ఒక్క సారి అయిన ఇలాంటి దేదీప్యమానమైన క్షేత్రాలని సందర్శించలి.నాకు ఆ నరసింహుడు చాలా సార్లు దర్శించి భాగ్యం కలిగించాడు. నరసింహ జయంతి కి విశేసమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.

ఈ పుణ్య క్షేత్రం హైదరాబాదుకు 140 కి.మీ ల దూరంలో కలదు. ఇక్కడికి చేరుకోవటానికి పట్టే సమయం : 3 గంటలు.