info.manatemples@mail.com

+91 9866933582

రామలింగేశ్వర స్వామి దేవాలయం –దామగుండం




భాగ్యనగరానికి 65 కి మీ దూరం లో పరిగి వెళ్ళే మార్గం లో పూడూర్ మండల కేంద్రానికి 2 కి మీ దూరం లో వెలసిన ప్రసిద్ది విష్ణు అనుసందమైన శైవ క్షేత్రం దామగుండా క్షేత్రం !దామగుండా దర్శనం మోక్ష దాయకం మరియు యమగండం ఉండదు అని చెబుతారు .ఈ క్షేత్ర మహత్యాన్ని స్కంద పురాణం లో వివరించడం జరిగింది.


ప్రాదాన ఆలయానికి ఎదురుగా గరుత్మంతుని దర్శనం లబిస్తుంది . ఆలయానికి సమీపం లో ఉన్న పుష్కరిణి(దామ సరోవరం ) లో స్నానం అచారిస్తే సర్వ రోగ నివారని అని చెబుతారు . దట్టమైన అడువుల మద్య వెలసిన ఎంతో మహిమన్మితమైన క్షేత్రం . కాకతీయుల కాలం లో నిర్మించినట్లు శాసనాల ద్వార తెలుస్తుంది .


శ్రీ రామ చంద్ర మూర్తి ప్రతిష్టించిన కోటి శివ లింగాలాలో ఇది కూడా ఒకటి అని చెబుతారు .అందుకే ఈ క్షేత్రానికి రామలింగేశ్వర క్షేత్రం అని పూర్వ కాలం లో నీలకంటశ్రమం అని కూడా పిలిచేవారట ! పూర్వం ఎంతో మంది మహర్షులు ఈ క్షేత్రం లో తపస్సు చేసుకునే వారట ఇప్పటికి మనకు ఆ ఆదారాలు ,గుహలు కనిపిస్తాయి . అల మునులు ,ఋషులు చే ఆరదించబడిన లింగం భూమిలో అంతర్దానమై కలియుగం లో దాముడు,గుండడు అనే వ్యవసాయదారుల పొలం లో ఉద్బావించాడు. వారు దానిని సామాన్య శీలా గ బావించి నాగలికి బరువుగా పెట్టి దున్నేవారు .స్వామి వారు వారిద్దరికీ స్వప్నం లో సాక్షాత్కరించి ఆ లింగ వృత్తాంతమును వివరించి అక్కడే ఉన్న సరోవరానికి ఎదురుగా ప్రతిస్టించమని వారి ఇద్దరి పేర్ల ఆదారంగనే క్షేత్రానికి దామగుండం అని పేరు వచ్చింది అని స్థల పురాణం చెబుతుంది .


గ్రహ బాద నివారణకు , సర్వ రోగ నివారణకు ఈ క్షేత్రాన్ని తప్పకుండ దర్శించి తీరాలి !

వెళ్ళు మార్గం :- హైదరాబాద్ నుండి పరిగి వెళ్ళు మార్గం లో పూడూర్ మండల కేంద్రానికి 2 కి మీ దూరం లో ఉంటుంది .

Route Map:-

ఈ పుణ్య క్షేత్రానికి దగ్గరలో
యోగానంద నరసింహ స్వామి దేవాలయం రాకంచెర్ల 5 కి మీ లో దూరం లో ఉంటుంది
లోంక ఆంజనేయ స్వామి దేవాలయం 8 కిమీ దూరం లో ఉంటుంది .
అనంత పద్మనభ్ స్వామి దేవాలయం ( అనంత గిరి కొండలు ) 22 కి మీ దురాలో ఉంటుంది.