info.manatemples@mail.com

+91 9866933582

హేమాచల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం




జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండల కేంద్రం లో గల మల్లూర్ ఘాట్ దగ్గర వెలసిన స్వయం భు లక్ష్మి నరసింహ క్షేత్రం ఇది . ఈ క్షేత్రం చాల పురాతనమైనది మరియు మహిమన్మితమైనది . చుట్టూ అడవి మద్యలో మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవడం చాల రమణీయంగా ఉంటుంది . యోగానంద నరసింహ స్వామి మరియు లక్ష్మి దేవితో కొలువై ఉన్న ఈ క్షేత్రం లో హనుమ ద్వారా పాలకుడై ఉన్నాడు . చుట్టూ దట్టమైన కొండల పైన వెలసిన ఈ క్షేత్రం లో చింతమాని పుష్కరిణి ఉంది . కొండ పై నుండి చింతమాని ధర ప్రవహిస్తుంది .ఎల్లప్పుడు ఇక్కడ నీరు ఉంటుంది .


భద్రాది నుండి గోదావరి ఎదురుగా సుమారు 90-100 కి మీ దూరం లో గల మల్లూరు నరసింహ క్షేత్రం ను హేమాచల లక్ష్మి నృసింహ క్షేత్రం (హేమాద్రి) అని పిలుస్తారు.ఇక్కడ ఉన్న ఉగ్రనరసింహ మూర్తి 9 అడుగుల ఎత్తు గల నరహరి అష్ట బుజములతో విరాజిల్లుతూ భక్త కోటికి దర్శనం ఇస్తున్నాడు . ఈ క్షేత్రం చాల మహిమన్మితమైన క్షేత్రం మరియు స్వామి ని దర్శించుకుంటే అన్ని రకాల బాదలు ,దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం .


వైశాక శుద్ధ పౌర్ణమి నుండి స్వామి వారి కళ్యానోత్సవములు నిర్వహించబడును . చాల మంది భక్తులు స్వామి వారి కళ్యాణోత్సవానికి వస్తారు.


వెళ్ళు మార్గం : - మంగపేట్ కి సుమారు 5 కి మీ దూరం లో ఉన్న ఈ క్షేత్రం ఎటూరునాగారం -భద్రాచలం వెళ్ళు మార్గం లో వస్తుంది .





వెళ్ళు మార్గం : -
మంగపేట్ కి సుమారు 5 కి మీ దూరం లో ఉన్న ఈ క్షేత్రం ఎటూరునాగారం -భద్రాచలం వెళ్ళు మార్గం లో వస్తుంది .


Route Map :-