info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ భవాని రామలింగేశ్వర దేవాలయం,కీసరగుట్ట




భాగ్యనగరానికి 40 కి మీ దూరం లో గుట్ట పైన వెలసిన అద్బుత శైవ క్షేత్రం శ్రీ భవాని రామలింగేశ్వర దేవాలయం .


స్థల పురాణం :
త్రేతా యుగం లో శ్రీ రాముడు సీతా దేవి హనుమత్ సమేతంగా వన విహారానికి ఈ ప్రాంతానికి వచ్చి ప్రకృతిని పరవశించి శివలింగాన్ని ప్రతిష్టించాలని సంకల్పించారు. మహర్షులు ముహూర్తం నిర్నహించగ శ్రీరాముడు శివ లింగాన్ని తెచ్చేందుకు హనుమంతుడి ని కాసి క్షేత్రానికి పంపించాడు. కాశి క్షేత్రంలో ఉన్న లక్షలాది లింగాల్లో ఒకదాన్ని ఎంచుకోలేక నూట ఒక్క లింగాలను తీసుకోని హన్మాన్ తిరుగు ప్రయాణం అయ్యాడు. ముహూర్తం సమయం సమిపిస్తుండడం తో హనుమంతుండు ఎంతకి రాకపోవడం తో శ్రీ రామచంద్ర మూర్తి శివున్ని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై శివ లింగ రూపాన్ని ధరించాడు . సీతారాములు శివలింగాన్ని ఎంతో సంతోషంగా ప్రతిష్టించారు అందుకే క్షేత్రానికి రామలింగేశ్వర లింగం అని పేరు వచ్చింది అని పురాణం గాథ !!


తరువాత నూట ఒక్కక లింగాలతో వచ్చిన హనుమ రాముని తో స్వామి ఒక్క లింగాన్ని ప్రతిష్టించు మిగతా లింగాలను తిరిగి కాశి చేరవేస్తానంటాడు అప్పుడు శ్రీరామ మూర్తి హనుమ నువ్వు రావడం ఆలస్యమైంది అందుకే ఈశ్వరుడ్ని వేడుకోగా ఆయన అనుగ్రహించిన లింగాన్ని ప్రతిస్టించాము అని చెప్తాడు . అంతట హనుమ బాద తో లింగాలను తోక తో చుట్టి విసిరేసాడు అని, అవి ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పడ్దాయి . శ్రీరామ చంద్రుడు హనుమను శాంతింప చేసి అ చంద్రతర్కారం ని పేరుతో ఈ పర్వతం కేసరిగిరి గ పిలవబడుతుంది అని వరమిచ్చాడు. క్రమేనా అది కీసరగుట్టా గా మారిపోయింది అని పురాణ గాథ !!


వెళ్ళు మార్గం : సికింద్రాబాద్ నుంచి చాల బస్సు సర్వీస్ లు ఉంటాయి