info.manatemples@mail.com

+91 9866933582

నరసింహుడు వృక్ష రూపం లో కొలువైన క్షేత్రం-కోప్పర




ఇందు గలడని సందేహం లేదు ఎందు ఎందు వెతికిన అందుగలడు..ఆ నరసింహుడు..దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై..ధర్మ పరిరక్షణకై శ్రీ మహావిష్ణువు రక రకాల అవతారాలు ఎత్తి మానవాళిని/భూ మండలాన్ని కాపుడుతూ ఉన్నారు..అలాంటి అవతారాలలో ఎంతో విశిష్టత ను సంపాదించుకున్నది నరసింహ అవతారం.


నరసింహుడు వృక్ష రూపం లో కొలువైన దివ్య ప్రదేశం.వందల శతాబ్దల చరిత్ర గల దేవాలయంగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అందమైన కృష్ణ తీరాన వెలసిన దేదీప్యమానమైన నరసింహ క్షేత్రం.రాయచూరు నుంచి 65 కి మీ దూరం లో మన్వి అనే చిన్న నగరానికి 10 కి మీ దూరం లో ఉన్న కోప్పరా అనే గ్రామం లో కార్పర ఋషి ఘోర తపస్సు ఫలితంగా నర్సింహ స్వామి ఒక వృక్షము లో అశ్వత రూపం లో దర్శనమిచ్చారు అని స్థల పురాణం..అందుకే క్షేత్రానికి కార్పర నరసింహ క్షేత్రం గా..కాలక్రమేణా అది కోప్పరాగా మారింది అని తెలుస్తుంది.
ప్రక్కనే ఉన్న కృష్ణమ్మ తల్లి ఒడి లో స్నామాచరించి స్వామి వారిని దర్శించుకుంటే సకల కష్టాలు,రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం...కోరిన కోరికలు నెరవేర్చే తండ్రి నరసింహుడు.. నరసింహ జయంతి కి విశేసమైన పూజ కార్యక్రమాలు నిర్వహించ బడుతాయి..
ప్రతి ఒక్కరు జీవిత కాలం లో ఇలాంటి క్షేత్రాన్ని ఒక సారి అయిన చూసి దేవా దేవుని అనుగ్రహం పొందాల్సిందే!
How to Reach:దేవదుర్గ్ నుండి 12 కిమి ఉంటుంది From Raichur 65km