info.manatemples@mail.com

+91 9866933582

మహానందిస్వర స్వామి దేవాలయం -మహానంది




పూర్వం శిలదుడనే మహర్షి సంతానం కోసం పరమేశ్వరుని గురుంచి తపస్సు చేసాడు . శివుడు ప్రత్యక్షమై కోరుకోమనగా నీకు భక్తులు అయి ఉండే ఇద్దరు పుత్రులను ప్రసాదించమని కోరాడు . ఈశ్వరుని కృప వలన ఇద్దరు కుమారులు జన్మించారు. వారి పేర్లు నంది ,పర్వతుడు. వారు పరమేశ్వరుని కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ముందుగ నంది వరం కోరుతూ , నువ్వు ఎల్లప్పుడు నా పై నివసించి ఉండాలి , నిన్ను నేను మోసే భాగ్యాన్ని ప్రసదించమించమని కోరాడు అతని కోరికగా శ్రీశైలానికి 200 కి మీ దూరం లో మహానంది రూపాన్ని పొందాడు . ఆనాటి నుంచి శివుని వాహనముగా మారాడు


నంద్యాల నుండి 15 కి మీ దూరం లో ఉన్న ఈ పురాతన క్షేత్రం చాల మహిమన్మితమైనది . నందీశ్వర స్వామి కొలువై ఉన్నాడు . నంద్యాల చుట్ట పక్కల అన్ని కలుపుకొని నవ నందుల దేవాలయు ఉన్నాయి అందుకీ ఈ క్షేత్రాన్ని నంది మండలం అంటారు


1. ప్రథమ నంది :
-------------
నంద్యాలకు నైరుతి బాగమున చామ కాలువ ఒడ్డ్డున రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంది
2. నాగానంది :
----------------
నంద్యాల పట్టనమునండలి ఆంజనేయస్వామి దేవాలయంలో వెలసియుంది
3. వినాయక నంది :
---------------
మహానంది లో ఆగ్నేయముగా ఉన్నది.ఇచ్చట నిత్య పూజలు జరుగుచున్నవి .
4. గరుడనంది :
-------------------
మహానంది కి పడమర దిక్కున ఉన్నది.
5. శివనంది :
--------------------
నంద్యాల పట్టనముకు సుమారు 15 కి మీ దూరంలో కడమ కల్వయను గ్రామంలో వెలసి ఉన్నది
6. విశ్నునంది :
--------------------
మహానందికి తూర్పున 3 కి మీ దూరం లో ఉన్నది ఁఅన్ది విగ్రహం పాలరాతి తో మలచబడి ఉన్నది.
7. మహానంది :
--------------------
నవ నందులలో ముఖ్యమైనది,మహానందిస్వరుడు వెలసియున్న పరమ పవిత్ర్ క్షెత్రమిది.
8. సుర్యనంది :
--------------------
నంద్యాల పట్టనముకు తూర్పున 5 కి మీ దూరం లో ఉన్నది.శుర్యుదు ఉదైన్చినప్పుడు అరుణ కిరణములు ఈ లింగం పైన పడును .
9. సోమనంది :
--------------------

నంద్యాల పట్టణమున తూర్పున ఉన్నది .


ఆలయ ప్రాంగణం లో మూడు నిటి దారాలు ప్రవహించుచున్నవి


బ్రమ్హ గుండం : ఆలయమునకు ఉత్తరం వైపు కలదు
విష్ణుగుండం : దక్షణం వైపు కలది
రుద్రా గుండం : ఈ గున్దములొని నీరు ఘర్బలయమునందు గల శివలింగం నుండి వచ్చు చున్నది .
గుండలలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయి లో ఉండను . పుశాకర్ని లో స్నానం సకల రోగాలను హరిస్తుంది