info.manatemples@mail.com

+91 9866933582

స్వయంభు శంబులింగేశ్వర ఆలయం -మెల్ల చెరువు




హుజూర్నగర్ నుండి 10 కి మీ దూరం లో గల మెల్ల చెరువు గ్రామం లో కాకతీయుల కాలం లో వెలసిన ఈ క్షేత్రం అద్బుతమైన ప్రదేశం . ఆలయం లోని లింగం పెరుగుతూ ఉంటుంది అని ఆ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు .


కాకతీయుల కాలం లో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ఘనమైన చరిత్ర గల దేవాలయం . ప్రతి రోజు స్వామి వారికి విశేసమైన పూజ, కార్యక్రామాలు నిర్వహించాబడుతాయి .


ఆలయం లోని శివలింగం 8 అడుగుల ఎత్తు ఉంది. ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే, ఆ శివలింగం అగ్ర భాగాన, అనగా తల పైన ఒక గుంటలాగా ఉంటుంది. ఆ గుంట లో నుంచి నీరు వస్తుంది. ఆ చోటు నుంచి అక్కడి పూజరులు నీరు తీసి భక్తులకు తీర్ధముగా ఇస్తారు. మరలా ఆ చిన్ని గుంట నిండ నీరు నిండుతుంది. ఇది ఆ స్వయంభు శివలింగం ప్రత్యేకత.

ప్రతి సంవత్సరం మహా శివరాత్రికి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జారుగుతాయి . అది చూడడానికి వేలల్లో భక్తులు పాల్గుంటారు .