info.manatemples@mail.com

+91 9866933582

ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయం




కడప నగరం నుంచి 28 కి మీ దూరం లో రాజంపేట పట్టణానికి సమీపం లో గల ఒంటిమిట్ట గ్రామం ప్రకృతి సోయగానికి నిలయం . 500 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్య పాలకుడు సదాశివరయుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం విజయనగ శైలికి చక్కటి ఉదాహరణ .


విశాలమైన అవారణలో నిర్మించబడిన ఈ ఆలయం లో చుట్టూ ఎత్తైన ప్రహరి గోడ నిర్మించబడింది తూర్పు,ఉత్తరం దక్షిణం వైపు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయబడ్డాయి . ప్రధాన గాలిగోపురం 165 అడుగుల ఎత్తులో ఉంటుంది . గర్భ గుడి లో సీతాలక్షమన సమేతుడై శ్రీ రాముడి విగ్రహాలు ప్రతిస్తిన్చాబడ్డాయి. ఐతే ఆంజనేయుని విగ్రహాలు గర్బగుడి లో కనిపించవు . ఆలయ సమీపం లోనే ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టిన్చాబడ్డాయి .


ఒంటిమిట్ట కోదండ రామాలయం చరిత్ర దృష్ట్యా సంస్కృతి,నిర్మాణ శాస్త్రం దృష్ట్యా ఎంతో ప్రాదాన్యతను సంతరించుకుంది. ఇంత అందమైన ,పవిత్రమైన ప్రత్యేకమైన ఆలయాన్ని ఒకసారి సందర్శించి మనోరంజనాన్ని ధైవసన్నిధిని అనుబించావొచ్చు.


ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి కి విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .