info.manatemples@mail.com

+91 9866933582

ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం -పంచదార్ల




విశాకపట్టననికి 50 కి మీ దూరం లో ఉన్న పంచదార్ల గ్రామం గాజువాక -ఎలమంచలిదారిలో వెళుతుంటే పాము పకుతున్నట్టుగా ఒక కొండ కనిపిస్తుంది దాని పేరు ఫనిగిరి పర్వతం .దాని దిగువనే రాంబిల్లి మండలం లో ఉన్నది పంచదార్ల గ్రామం


స్థలపురాణం ప్రకారం ఒకప్పుడు వర్ధమాన లింగం ఉండేదట అది కాలక్రమేనా మరుగున పడిపోయిందట . ఒకసారి యమ ధర్మ రాజు తన రోగం నయం కావడానికి ఇక్కడికి వచ్చి లింగాన్ని పునహ ప్రతిస్టించాడు అందుకే దానికి ధర్మలింగేశ్వర క్షేత్రం గ పేరు వచ్చింది అని చెబుతారు .


చాళుక్యుల కాలం లో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది . వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం ఏంటో చారిత్రక సంపదను కలిగి ఉన్న దివ్యమైన క్షేత్రం .

ఈ క్షేత్రం లో పంచాదరాలు అవిశ్రాంతంగా ప్రవహిస్తుంటాయి . రాధా మాధవ స్వామి ఇక్కడ స్వాగతం చెబుతుంది అందుకే దీనిని క్షేత్రపాలక దేవళం అని కూడా పిలుస్తారు . ఫాల్గుణ మాసం లో స్వామి వారికి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి