info.manatemples@mail.com

+91 9866933582

పర్ణశాల రామాలయం -పర్ణశాల


శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే !!

స్వయానా శివుడు పార్వతి దేవికి చెప్పిన విషయం ఒకసారి శ్రీరామ నామం పాటిస్తే వేయి విశ్నునామలు స్మరించినట్లే అని . అంతటి గొప్పది రామనామం .రామ బాణం కంటే రామ నామమే మహిమన్మితమైనది అని నిరూపించాడు హనుమ. ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి అని పురాణాలూ చెబుతున్నాయి .
"రామ ఏవ పరంబ్ర్హమా, రామ ఏవ పరంతపః రామ ఏవ పరంతత్వ శ్రీ రామో బ్రహ్మ తారకం "

రామనామం వలన బ్రహ్మ హత్య పాపం ,మద్యపాన దోషం ,గురుపత్ని సంయోగ పాపములు సైతము రామనామ స్మరనచే హరించును . సకల కల్మష నాశక మంత్రం .


మహారాష్ట్రలో ని నాసిక్ కి 18 కి మీ దూరం లో గల సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో త్ర్యంబకేశ్వరం వద్ద బ్రహ్మగిరి శికారం పైన జన్మించి త్ర్యంబకం లో ని గోముఖం గుండా సన్నని ధారా ప్రవాహంగా గోదావరి ప్రారంబం అవుతుంది . అలా ప్రవహిస్తూ చిన్న చిన్న వాగులు,వంకలు ,ఉపనదులను కలుపుకుంటూ తెలంగాణాలోని నిజామాబాదు జిల్లలో లో కందుకుర్తి దగ్గర తెలుగు నెలా పైన అడుగిడుతుంది . హరిద్ర ,మంజీరా లను కలుపుకొని చదువుల తల్లి బాసర లో జ్ఞాన సరస్వతిని ముద్దాడి , కరీంనగర్ లోని ధర్మపురి,కాళేశ్వరం లోని ముక్తేశ్వర ని దర్శించుకొని ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి లో రాముల వారిని సేవిస్తూ మెల్లగా అడుగులేస్తూ తెలంగాణా నెలా పైన సెలువు తీసుకోని ఆంధ్ర ప్రదేశ్ లో అడుగిడి పాపికొండ ల మద్య ఆటలాడుతూ ,పాటలడుతూ పట్టిసీమ వీరభద్రుని చెంతలో చేరి పిమ్మట రాజమహేంద్రవరానికి చేరుకొని అక్కడ సేద తీరి చివరగా అన్త్రవేది నరిసంహ స్వామి దర్శించుకొని సముద్రం లో కలిసిపోతుంది. గోదావరి నది ఏడు పాయలుగా వీడిపోయి సముద్రం లో కలుస్తుంది. అందమైన గోదావరి నది లో ప్రయాణం ,ఆ నీళ్ళలో ఉన్న మహత్యం మనకు దొరకడం మన తెలుగు వాళ్ళం ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలమో .


భద్రాచలం జిల్లా దుమ్ముగూడెం మండలం లో గల పర్ణశాల గ్రామం లో వెలసిన పర్ణశాల రామాలయం కూడా ఎంతో ప్రసిద్ది చెందినది .వనవాస సమయం లో శ్రీ రాములవారు ఇక్కడ పర్ణశాల వేసుకొని ఉన్నట్లు పురాణాలూ, వాల్మీకి రామాయణం చెబుతున్నాయి . నిండుగా ప్రవహించే గోదావరి తీరం లో ఉన్న ఈ గుడి లో అడుగు పెడితే చాలు మహా ప్రశాంతంగాఉంటుంది. ఒక వైపు నది ,మరొక వైపు కొండలతో ఈ ఉరు సౌందర్యానికి ప్రతికల ఉంటుంది .

పర్ణశాల దేవాలయానికి కొద్ది దూరం లో సీతమ్మ వాగు పేరుతో ఒక కొండవాగు ఉంది .ఆ వాగులో సీతమ్మ దేవి స్నానం చేసేదని అందుకే దానికి సీతమ్మ వాగు అని పేరు వచ్చింది అని చెబుతారు .




సీతమ్మ వారు పసుపు కుంకుమలకు కొన్ని రాళ్ళూ వాడేదని అందుకే అ రంగు రంగు ల కొండ రాళ్ళూ మరింత శోబను సంతరించుకున్నాయని అంటారు . రామ లక్ష్మణులు,సీతమ్మ తిరిగిన ఈ ప్రదేశాన్ని చూడడానికి చాలామంది బక్తులు వస్తు ఉంటారు .


రాముడు బంగారు లేడి రూపంలో వచ్చిన మారీచుని ఇక్కడే చంపాడు. అప్పుడు రావణాసురుడు సీతను అపహరించగా నేలపై ఒక గుంట ఏర్పడింది. పర్ణశాలలో ఉన్న గుంట ఈ కారణంగా ఏర్పడినదే అని ప్రతీతి..భద్రాచలం వెళ్ళే ప్రతివారు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని అక్కడి ప్రకృతి రమణీయతను అనుబావిస్తారు .







వెళ్ళే మార్గం : హైదరాబాద్ నుండి 310 కిమీ దూరం లో భద్రాచలం