info.manatemples@mail.com

+91 9866933582

లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -పెంచలకోన




నెల్లూరు జిల్లా లోని రాపూర్ మండల కేంద్రం లో గల పెంచల కోన క్షేత్రం లో లక్ష్మి నరసింహ స్వామి స్వయం భు గ వెలసిన క్షేత్రం . నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటి ఆయన పెంచలకోన లో స్వామి వారు చెంచులక్ష్మి సమేతుడై స్వయం భు గా వెలసి ఉన్నాడు.


బక్తుల పాలిట ఇలవేల్పు అయి బక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంమయాడు . ఈ క్షేత్రం చెంచు రాజులకు నిలయమైనందున ఉగ్రరుపుడైన నరసింహుడు సుందరాంగి అయిన చెంచు వనిత చెలిమి తో పెనవేసుకొని శిలరుపమున ఇక్కడ వెలసినట్లు స్థల పురాణం చెబుతుంది .
హిరణ్యకస్యపున్ని సంహరించి మహౌగ్ర రూపం తో వెళ్తుంటే దేవతలు అందరు బయపడిపోయారు.అలా శేష చలం కొండల్లో సంచరిస్తుండగా ఆయనకు చెంచు రాజు కుమార్తె ఆయన చెంచు లక్ష్మి కనిపించింది . ఆమె జగన్మోహన్ సౌందర్యం స్వామిని శాంతింప చేసింది.ఆ తరువాత ఆమెని వివాహం చేసుకొని నెల్లూరు జిల్లా లోని రాపూర్ మండల కేంద్రం లో అటవీ ప్రాంతం లో వెలిసాడు.ఆ శీలా కనిపించిన ఈ ప్రాంతం పెనుశీల కోన అయింది అది కాలక్రామేనా పెంచలకోన గ మారింది అని స్థల పురాణం చెబుతుంది .


1827 ఆ ప్రాంతం లో ఈ ఆలయం వెలుగులోకి వచ్చింది . పెంచల వంశస్తులు తొలిసారిగా ఈ కొనలో పూజలు చేసారు . పెనుశిల నరసింహ స్వామి ని సంతానం లేని వారికి సంతానాన్ని అనుగ్రహించే స్వామిగా భావిస్తారు. కొండల పైనుండి జాలువారే జలపాతము ఎంతో ఆకట్టుకుంటుంది . ఏంటో అద్బుతమైన, రమణీయమైన క్షేత్రం జీవిత కాలం లో ఒకసారి ఆయన దర్సిన్చాగాలిగితే అంతకన్నా మహాభాగ్యం ఏమి ఉండదు .


ప్రత్యేక కార్యక్రమాలు :-
ప్రతి శనివారం ఇక్కడ ఘనంగా పూజలు జరుగుతాయి.
స్వామి వారు బ్రహ్మోత్సవాలు వైశాక శుద్ధ ఏకాదశి నాడు ప్రారంబమవుతాయి అయుదు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి .
వెళ్ళు మార్గం :-
నెల్లూరు నుండి ప్రతి గంట కు ,రాపూరు నుండి అరగంట కు ఒక బస్ సర్వీస్ ఈ క్షేత్రానికి ఉంటుంది .









How to Reach: