info.manatemples@mail.com

+91 9866933582

వైకుంట నారాయణ స్వామి దేవాలయం –రాజోలి




కృష్ణమ్మా పరవళ్ళు తొక్కే అందమైన పాలమూరు జిల్లలో అడుగడుగునా దేవాలయాలే. పురాతన దేవాలయాలు ఎంతో అద్బుతంగా,కళాత్మకంగా , రమణీయంగా నిర్మించినవే. ప్రబుత్వాలు పట్టించుకోక పోవడం, మన దగ్గర అన్ని ఉన్న అవి వదిలిపెట్టుకొని ఎక్కడెక్కడో వెళ్ళడం వాళ్ళ అన్ని శితిలావస్థ కు చేరుకుంటున్నాయి. వాటిని కాపాడే బాద్యత మనమే తీసుకోవాలి .


మహబూబ్ నగర్ జిల్లాలోని వడ్డేపల్లి మండల కేంద్రం లో వున్నా రాజోలి గ్రామం లో వెలసిన వైకుంట నారాయణ స్వామి దేవాలయం చాల పురాతనమైనది. వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం ఎంతో మహిమన్మితమైన క్షేత్రం . ఇక్కడ వెలసిన స్వామి వారు ఎంతో శక్తి వంతమైన దైవం. నారాయణ స్వామి తో పాటు లక్ష్మి దేవి కూడా కొలువై ఉన్న దివ్య క్షేత్రం . ఈ గ్రామము కర్నూలు జిల్లా కు సమీపం లో ఉంది .


అందమైన విగ్రహాలు ,అద్బుతమైన శిల్పకళా ఈ దేవాలయ కట్టడాల్లో కనిపిస్తుంది . తుంగభద్రా నది తీరాన సుంకేశుల డ్యాం కి సమీపం లో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. సోమన్నభూపాలుడు నిర్మించిన కోట కలదు అదే రాజోలి కోట గ ప్రసిద్ది చెందింది .


ఒకప్పుడు గద్వాల సంస్థానాన్ని పారిపాలించిన సోమన్న భూపాలుడు 11 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు తను తన తల్లి తో పాటు ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుడు సోమ భుపాలుడిని తన ఇంట్లో ఉంచుకొని మంచి విద్య బుద్దులు నేర్పాడట . రాజు గారు పెద్దగ అయ్యాక గద్వాల సంస్తనదిష్యుడయ్యాడు. ఆయనే ఇక్కడ లక్ష్మి దేవి సమేతంగా వైకుంట నారయణ స్వామి దేవాలయాన్ని నిర్మించారు అని స్థల పురాణం . ఆలయ ఆవరణ లో ఆంజనేయ స్వామి దేవాలయం కొలువై ఉంది .
దేవాలయం లో జరుగు ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలు:-
ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి కి ఇక్కడ ఉత్సవాలు నిర్వహించాబడుతాయి . ఆ కార్యక్రమానికి చాల మంది భక్తులు వస్తారు . ప్రతి ఒక్కారు తప్పకుండ దర్సించానీయమైన క్షేత్రం ఇది . ప్రబుత్వాలు పట్టించుకోక, భక్తులు ఎవరు దర్సించక దేవాలయం సితిలవస్థ లో ఉంది . గ్రామములోని మరియు సమీపం లో ఉన్న ప్రముఖ దేవాలయాలు:

• రామప్ప దేవాలయం
• అడివేశ్వరస్వామి దేవాలయం.
• శివాలయం ( కుంబ్ శ్వర స్వామి దేవాలయం )


వెళ్ళు మార్గం :- కర్నూల్ నుండి మంత్రాలయం వెళ్ళే మార్గం లో సుంకేశుల డ్యాం దగ్గర వస్తుంది .
వడ్డేపల్లి నుండి రాజోలి కి రవాణ సౌకర్యం కలదు.






Address:
Vaikunta Narayana Swamy temple,Rajoli,Vaddepalli manda,Mandal, Jogulamba Alampur District, Telangana.


How to Reach:-
By Road
Kurnool is the Nearest Town to Rajoli. Kurnool is 38 km from Rajoli. Road connectivity is there from Kurnool to Rajoli.


Route Map:-