info.manatemples@mail.com

+91 9866933582

యోగానంద నరసింహ స్వామి -రాకంచెర్ల




హైదరాబాద్ నుండి పరగి వెళ్ళే మార్గం లో రాకంచెర్ల అనే గ్రామంలో ఈ ప్రసిద్ద పుణ్య క్షేత్రం వేలుగుందౌతుంది.


400 సంవత్సరాల చరిత్ర గల యోగానంద నరసింహ స్వామి దేవాలయం ఒక కొండ పైన వెలసి ఉన్నది. ఒక రాయి పైన స్వామి వారు స్వయం భు గ వీరాజిలుతున్న క్షేత్రం.నరసింహ స్వామి యోగ ముద్ర లో వెలుగొందుతున్నాడు. ఆలయానికి సమీపం లో ఒక చిన్న కొలను ఉంది.అక్కడ భక్తులు స్నానం ఆచారించి నరసింహ క్షేత్రాన్ని సందర్శిస్తారు.ఈ క్షేత్రం లో ఉన్న స్వామి వారి విగ్రహాన్ని చీమలు మలిచాయి అని స్థల పురాణం . మహర్షి వెంకటాదసుల వారు స్వామి వారిని ప్రతి నిత్యం పూజించి వేయి కీర్తనలకు పైగా రాసారు అని దాంట్లో కొన్ని మాత్రమే ప్రస్తుతం పుస్తక రూపం లో ఉన్నాయి . ఆలయ ఆవరణ లో వెంకట దాసుల వారి విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది . ఆలయ ఆవరణ లో ఆంజనేయ స్వామి దేవాలయం , పాండురంగ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి .


చుట్టూ కొండలు , ఆలయ ఆవరణ లో అంతా మామిడి తోటలు ఎంతో రమణీయంగా ,చూడ చక్కగా ఉంటుంది . ప్రతి సంవత్సరం వైశాక పౌర్ణమి రోజు ఇక్కడ స్వామి గారి కల్యాణోత్సవం జరుగుతుంది . అది చూడటానికి చాలామంది బక్తులు వస్తుఉంటారు .










ఈ పుణ్య క్షేత్రానికి దగ్గరలో
దామగుండం ( రామలింగేశ్వర స్వామి ) 5 కి మీ లో దూరం లో ఉంటుంది
లోంక ఆంజనేయ స్వామి దేవాలయం 8 కిమీ దూరం లో ఉంటుంది .
అనంత పద్మనభ్ స్వామి దేవాలయం ( అనంత గిరి కొండలు ) 22 కి మీ దురాలో ఉంటుంది.
వెళ్ళు మార్గం :
రాకంచెర్ల ( యోగానంద నరసింహ స్వామి దేవాలయం ) ( హైదరాబాద్ -పరిగి మార్గం లో ప్రధాన రహదారి పైన ఉన్న రాకంచెర్ల గ్రామం లో ఉంటుంది )

Route Map :-