info.manatemples@mail.com

+91 9866933582

కోదండ రామ స్వామి దేవాలయం -తిరుపతి




తిరుపతి పట్టణం మద్యలో కోదండ స్వామి ఆలయం ఉంది . శ్రీరామచంద్రమూర్తి సీత లక్ష్మణ సమేతంగా ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు . రావణ సంహారానంతరం శ్రీ సీత, లక్ష్మణ , సుగ్రీవ , హనుమంత ,జాంబవంత , అంగాధులను వెంటబెట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చినట్లు స్థల పురాణం చెబుతుంది . తన పరివారం తో ఇక్కడకి వచ్చినట్లు ,పుష్కరిణి లో స్నానం చేసినట్లు ,జాంబవంతుడు అందుకు నిదర్శనంగా ఈ దేవాలయాన్ని కట్టించారు అని స్థల పురాణం చెబుతుంది .


తిరుపతి పట్టణం నది బొడ్డున విశాలమైన ప్రాంగణం లో శ్రీ కోదండ రామాలయం మనోహరంగా ధర్శనం ఇస్తుంది . 10 వ శతాబ్దం లో ఆలయ నిర్మాణం జరిగినట్లు శాసనాల ద్వార తెలుస్తుంది . తిరిగి ఆలయ పునర్నిర్మాణం 15 వ శతాబ్దం లో శ్రీ కృష్ణ దేవరాలయ ల కాలం లో జరిగింది.ఆలయానికి ఎదురుగా శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది గర్భాలయం లో శ్రీ రామచంద్రమూర్తి కొదందరామునిగా కొలువు తీరి ఉన్నాడు . స్వామి కి ఇరు వైపులా శ్రీ సీతాదేవి ,లక్ష్మణుడు కొలువుదీరి ఉన్నారు .