info.manatemples@mail.com

+91 9866933582

ఉమా మహేశ్వరాలయం,రంగాపూర్,అచ్చంపేట్







నాగర్ కుర్నూల్ జిల్లా నల్లమల్ల అడవి ప్రాంతంలో అచ్చంపేట్ మండలం రంగాపూర్ గ్రామనికి సమీపం లో ఎతైన కొండలపైన వెలసిన క్షేత్రం ఉమా మహేస్వరలయం . కొండల పై నుండి వచ్చే అందమైన నిటి సెలయేళ్ళు చూడడానికి ఎంతో అద్బుతంగా ఉంటాయి .
శ్రీశైలానికి ఉమామహేశ్వరం ఉత్తరం వైపు ఉంటుంది... ఉమామహేశ్వరం దర్శనం లేనిది శ్రీశైల దర్శనం పరి పూర్ణం కాదు అని పురాణం గథ. ప్రదనాలయం లో ఉమా సహిత మహేశ్వర స్వామి కొలువై ఉన్నాడు .లింగ రూపం లో కొలువై ఉన్న స్వామి సహజ సిద్దంగా వెలిసాడు అని స్థల పురాణం చెబుతుంది . దట్టమైన నల్లమల అడువులు ఇక్కడి నుండే ప్రారంబామవుతాయి.



కాకతీయుల కాలం నాటి నుండి ఈ క్షేత్రం ఎంతో పేరు ప్రక్యతులు గాంచింది . రావణ వధ అనంతరం శ్రీ రామ చంద్ర మూర్తి ఈ క్షేత్రం నుండే శ్రీశైలం ప్రదిక్షణ మొదలు పెట్టాడు అని పురాణాలూ చెబుతున్నాయి . పైన నుంచి పడే అందమైన నిటి ప్రవాహం ,చుట్టూ దట్ట మైన అడువులు ,కొండ పైన వెలసిన ఈ క్షేత్రం ఎంతో గానో ఆకట్టుకుంటుంది . ప్రతి ఒక్కరు జీవిత కాలం లో ఒకసారి అయిన తప్పకుండ దర్సిన్చానీయమైన క్షేత్రం . ఈ క్షేత్ర మహత్యాన్ని వివిధ పురాణాలలో వివరించడం జరిగింది . శ్రీశైల క్షేత్ర దర్శనం ఉమా మహేశ్వరం చూడనిదే పరి పూర్తి కాదు అని చెబుతారు .


ప్రత్యేక పూజలు : - స్వామి వారికి ప్రతి నిత్యం చేసే పూజ కార్యక్రమాల తో పాటు మహా శివరాత్రికి విశేషమైన పూజ కార్యక్రామాలు నిర్వహించాబడుతాయి . ఆ సమయం లో చాలామంది భక్తులు ఇక్కడికి వస్తు ఉంటారు .