info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ వారిజల వేణుగోపాల స్వామి దేవాలయం - గోపలాయపల్లె ,నార్కెట్పల్లి




హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే మార్గం లో నార్కెట్పల్లి కి సమీపం లో గోపలాయపల్లె లో వెలసిన వైష్ణవ క్షేత్రం వారిజల వేణుగోపాలస్వామి దేవాలయం.


నల్గొండ జిల్లా నార్కెట్పల్లి కి 2 కి మీ దూరం లో ఉన్న గోపలాయపల్లె లో శ్రీ వారిజల వేణుగోపాల స్వామిదేవాలయం వెలసి ఉంది. 1987 లో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు.ఈ ప్రాంతఃన్ని గోవర్ధన గిరిగా పిలుస్తారు . రుఖ్మిని సత్యబామ వేణుగోపాల స్వామి గ వెలసి ఉన్నాడు.గుట్ట పైన వెలసిన ఈ క్షేత్రం చాల చూడ చక్కగా ఉంటుంది.చుట్టూ పచ్చని చెట్లు ,కొండలు ఎంతో రమణీయంగా ఉంటుంది .


శ్రీకృష్ణుని సుందర విగ్రహంరుఖ్మిని సత్యబామ సమేతంగా దర్శనం ఇస్తుంది.కొండపైన రాతి బండల నడుమ పాదుకలు ఉన్నాయి.మకర తోరణం లో తిరునామం తో ఉత్సవ మూర్తి ఉంది.ఈ దేవాలయానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి.ఆలయ ప్రాంగణం లో ఉన్న ధ్వజ స్థంబం,దేవాలయ గోపురం ఎంతో అద్బుతంగా ఉంటాయి.


వారిజల చెట్టు కింద ఒక పుట్ట ఉండేది అట పుట్టలో శ్రీ కృష్ణుడు బాలుడి రూపం లో కొలువై ఉన్నాడట.ఒక గోవు ప్రతి నిత్యం వచ్చి రోజు పాలు ఇచ్చేది అట.అది గమనించిన యెజమని గోవు వచ్చి పాలు ఇవ్వడం గమనించి ఆ బాలుడిని తల పైన కొట్టడం జరిగిందట వెంబడే రక్తం ఏరులై ప్రవహించగా అతడు తప్పు తెలుసుకొని మన్నించమంగ అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై తను ఇక్కడ ఉన్న సంగతి ఎవరికి చెప్పొద్దూ చెబితే ప్రాణ లు పోతాయని చెప్పగా ఆయనను ఆ యెజమని తన ఒక్కడి ప్రాణాలు పొతే ఏమి కాదు అని అందరికి శ్రీ కృష్ణ పరమాత్ముడి గురుంచి చెప్పాడు అని స్థల పురాణం .అలా వెలసిన క్షేత్రమే వారిజల వేణుగోపాల స్వామి దేవాలయం .
ఈ క్షేత్రానికి సమీపం లోనే శివాలయం ఉంది మరియు ఇతర దేవాలయాలు ఉన్నాయి.శివాలయం లో రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడు .


ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణాష్టమి కి ఇక్కడ విశేషమైన పూజ కర్యాక్రమాలు నిర్వహించాబడుతాయి. మాఘ మాసం లో స్వామి వారి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి .


వెళ్ళే మార్గం : హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే మార్గం లో నార్కెట్పల్లి కి 2 కి మీ దూరం లో ఉన్న గోపలాయపల్లె










How to reach:
This place you can reach from Hyderabad just in 1-1.20Hrs (82Kms) by road or train.