info.manatemples@mail.com

+91 9866933582

రాజ రాజేశ్వర స్వామి దేవాలయం -వేములవాడ




కరీంనగర్ పట్టణానికి 35 కి మీ దూరం లో ఉన్న వేములవాడ పట్టణం లో వెలసిన రాజ రాజేశ్వర స్వామి దేవాలయం చాళుక్యుల కాలం నాటిది . వేయి సంవత్సరాల చరిత్ర గల ఈ దేవలయం


శ్రీశైల శికారం దర్శనం చూడడం వాళ్ళ ముక్తి కలుగుతుంది అని ,కాశి లో మరణిస్తే మోక్షం లబిస్తుంది అని ఇతర క్షేత్రాలలో తపస్సు చేస్తే మోక్షం కలుగుతుంది అని పురాణగాథలు కానీ, ధర్మగుండం పేరు వింటేనే మోక్షం కలుగుతుంది అని ప్రతిక .


అర్జనుడి మనవడు అయన నరేంద్రుడు పొరపాటున లేడి అనుకోని ఒక ఋషిని చంపాడట . అతనికి కలిగిన పాపం ఎన్ని పూజలు చేసిన పోలేదు . ఆలా తిరుగుతూ దప్పికాయ ధర్మగుండం లో దీగి స్నానం చేసి దోసిట తో నీరు త్రాగాగానే పాపపరిహారం పొందాడు అని, స్వామి అతనికిస్వప్నం లో కనిపించి ధర్మగుండం అడుగున రాజేశ్వర రూపం లో తను ఉన్నని అని దానిని తీసి ప్రతిష్టించాలని ఆనతిచ్చాడు . నరేంద్రుడు అలాగే ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం . ఈ స్వామి ని త్రేతా యుగం లో రాములవారు ,ద్వాపర యుగం లో పండువాలు అర్చించారని మారో గాథ చెబుతుంది .


శ్రీ రాజ రాజేశ్వర స్వామి నీలలోహిత లింగాకార రూపం లో వేలియగా , అమ్మ వారు ,నందీశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు .


ఈ ఆలయం లో 22 శివలింగాలు ఉన్నాయి . కోదండ రామాలయం , కాశి విశ్వేశ్వర ఆలయం , మహిససురమర్ధిని ఆలయం చూడదగినవి . ఇక్కాడ ఉన్న శ్రీ రాజ రాజేశ్వర స్వామి ని రాజన్న అని కూడా పిలుస్తారు . శ్రీ రాజ రాజేశ్వర దేవాలయంతో పాటు అనంత పద్మనాభ స్వామి దేవాలయం, శ్రీ రామ చంద్ర స్వామి దేవాలయాలు కూడా కొలువై ఉన్నాయి .