info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ శ్రీ త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవాలయం



11 వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ఆధ్యాత్మిక కు కొలువైన కేంద్రము . గర్భాలయం లో ఉన్న మూడు శివలింగాలు ఒకే ఎత్తు లో మనకు కనిపిస్తాయి . 24 అడుగుల ఎత్తు లో ముఖ మండపం ఉంటుంది . ముఖ మండపం లో ఎడమ వైపు పార్వతి దేవి కొలువై ఉంది . కుడి వైపు లక్ష్మి గణపతి కొలువై ఉన్నాడు . అద్బుతమైన కట్టడాలు , అందంగా కనిపించే శికారాలు ,శికరాల పైన కలశం చాల చూడ చక్కగా ఉంటాయి . కర్ణాటక కదంబ శైలిని పోలి ఉంటుంది .
శ్రీ శ్రీ త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవాలయం ను హరి హర క్షేత్రం అని కూడా పిలుస్తారు . ఈ ఆలయ ఆవరణ లో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కూడా కొలువై ఉంది అందుకీ ఈ క్షేత్రాన్ని శైవ-వైష్ణవ క్షేత్రం అని కూడా పిలుస్తారు . మహా శివరాత్రికి ,శ్రీ రామ నవమికి ఇక్కడ విశేషమైన పూజ కర్యాక్రమాలు నిర్వహించాబడుతాయి . ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సించాల్సిన క్షేత్రం ఇది .


వెళ్ళు మార్గం : - కరీంనగర్ నుండి 23 కి మీ లు ,వేములవాడ నుండి 12 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంటుంది .