info.manatemples@mail.com

+91 9866933582

లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -యాదగిరి గుట్ట




నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహ స్వామి కి ఘనమైన చరిత్ర ఉంది .


పూర్వం ఋష్యశృంగుని కుమారుడైన యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. అప్పుడు మహావిష్ణు ప్రత్యక్షమవ్వగా తనకు నరసింహుని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట.అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసింహుడు,యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట అని స్థల పురాణం చెబుతుంది .


స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.ఇప్పుదు ఈ ప్రదేశాన్ని తొలచి ఇంకా విశాలంగా తిర్చిదిద్దారు . లోనికి దిగేముందు పంచముఖ ఆంజనేయ స్వామి కోవెల ఉంది .ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండ పై గండబేరుండ నరసింహమూర్తి ఉంది గర్బ గుడి లో జ్వాల నరసింహ,యోగానంద నరసింహ మూర్తులు ఉన్నాయి .


కొండపైన స్వామి వారి పుష్కరాని కూడా ఉంది . ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే సకల కష్టాలు, రోగాలు నాయమయిపోతాయని బక్తుల నమ్మకం . గర్భ గుడి లో లక్ష్మి నరసింహుల ఉత్సవ విగ్రహాలు ఉన్నయీ. గోదాదేవి మందిరం కూడా ఉంది . ఆలయ ఆవరణ లో గల అద్దాల మండపం , కొండ పైన ఉన్న శివాలయం తప్పకుండ చూడదగినవి .


ప్రతి సంవత్సరం పాల్గుణ మాసం లో స్వామి వారి బ్రమోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి .

సమీపం లో చూడదగిన ప్రదేశాలు :- సురేంద్రపురి క్షేత్రం

ఏదులాబాద్ రంగనాథ స్వామి దేవాలయం
భోనగిరి కోట,భోనగిరి ఆంజనేయ స్వామి దేవాలయం



వెళ్ళే మార్గం : హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది