info.manatemples@mail.com

+91 9866933582

భీమేశ్వరాలయం- ద్రాక్షారామం




త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామాన్ని కార్తీక మాసంలో దర్శించుకునే భక్తులకు కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని నమ్మకం. కాకినాడ నుంచి 30 కి.మీ దూరములోను, రాజమండ్రికి 60కి.మీ దూరములోను ద్రాక్షారామం ఉంది. భీమేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామ ఆలయంలో శివుడు లింగాకారంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో లింగం సగ భాగం నల్లగానూ, సగ భాగం తెల్లగానూ ఉంటుంది.


అందుకే శివపరమాత్మను అర్థనారీశ్వరుడని పిలువబడడానికి ఈ ఆలయమే నిదర్శనమని శాస్త్రాలు చెబుతున్నాయి. 60 అడుగుల ఎత్తు కలిగి ఉన్న ఈ లింగానికి పై అంతస్తులోకి వెళ్లే పూజలు నిర్వహిస్తారు. భీమేశ్వర ఆలయంలో నందీశ్వరుడు తూర్పు ముఖద్వారంలో వెలసి ఉంటాడు.


కాశీ విశ్వేశ్వరాలయంలోని వినాయకుడి వలె భీమేశ్వర ఆలయంలో వెలసిన విఘ్నేశ్వరుడు కూడా కుడిచేతిమీదుగా తొండం కలిగి ఉంటాడు. దక్షప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేసిన కారణంతోనే ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అన్నపేరు వచ్చిందని ప్రతీతి.


తారాకాసురునిని కుమారస్వామి వధించే సమయంలో అతని కంఠంలోని అమృత లింగం చిన్నాభిన్నమై 5 ముక్కలైయ్యాయని పురాణాలు చెబుతున్నాయి. అందులో ఒకటి ద్రాక్షారామంలో, రెండవది అమరారామం (అమరావతి)లో, మూడవది క్షీరారామం (పాలకొల్లు)లో, నాలుగవది సోమారామం (భీమవరం)లో, అయిదవది కుమారారామం (సామర్లకోట)లో పడ్డాయని శాస్త్రోక్తం.



ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రామాలు
--------------------------------------------
మహా శివరాత్రి ఉత్సవాలు ,స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు, ఈ ఐదు క్షేత్రాల్లో వెలసిన శివపరమాత్మను కార్తీకమాసాన దర్శించుకునే భక్తులకు సకల సంపదలు, పుణ్యఫలములు చేకూరుతాయి.
వెళ్ళు మార్గం
---------------------
కాకినాడ నుంచి 30 కి.మీ దూరములోను, రాజమండ్రికి 60కి.మీ దూరములోను ద్రాక్షారామం ఉంది.

Route Map:-