info.manatemples@mail.com

+91 9866933582

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం -కాళేశ్వరం




గోదావరి నదిలో ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న క్షేత్రమే కాళేశ్వరం .త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమన్మితమైనది .
కరీంనగర్ పట్టణానికి 132 కి మీ దూరం లో మంథని సమీపం లో దట్టమైన అడవి ,చుట్టూ ప్రకృతి రామయనితల మద్య ,గోదావరి నదికి దగ్గరలో వెలసిన ఈ క్షేత్రం చాల పురాతనమైనది . స్కాందపురాణం లో ఒక కాండం కాళేశ్వర క్షేత్ర మహత్యాన్ని వివరిస్తుంది .


గర్బ గుడి లో రెండు శివలింగాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత . దర్శించిన బక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తి నిస్తున్డటం తో యముడికి పని లేకుండా పోయిందట . అంతట యమ మహారాజు స్వామి ని వేడుకోగా అప్పుడు యమున్ని కూడా తన పక్కనే లింగాకారం లో నిల్చోమన్నాడట . ముక్తేస్వరున్ని చూచి యమున్ని దర్సించకుండా వెళ్తే మోక్ష ప్రాప్తి దొరకదు అని వాళ్ళని నరకానికి తీసుకోని పోవొచ్చు అని శివుడు చెప్పాడట . అందుకీ బక్తులు స్వామి ని దర్శించుకొని,కాళేశ్వర స్వామి ని కూడా దర్శించుకుంటారు .


ముక్తేశ్వర స్వామి లింగం లో మరో ప్రత్యేకత ఉంది .లింగమ్ లో రెండు రంద్రాలు ఉన్నాయి .ఈ రంద్రం లో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడ సమీపం లో ఉన్న గోదావరి ,ప్రాణహిత సంగమ స్థలం లో కలుస్తుంది అని చెబుతారు . కాళేశ్వరక్షేత్రం శిల్పకళానిలయం. ఇక్కడ ఇప్పటి వరకు బయటపడ్డ అనేకశిల్పాల వల్ల గతవైభవం తెలుస్తుంది. కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనమత్ తీర్థం, జ్ఞానతీర్థం, వాయుసతీర్థం, సంగమతీర్థం, ఇత్యాది తీర్థాలున్నాయి.


కాళేశ్వరంలోని ప్రధానాలయానికి పశ్చిమం వైపు యమగుండం మీద సుమారు ఒక కి.మీ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం. ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందు పూజచేసి, అనంతరం ముక్తీశ్వరుని పూజిస్తే, స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.




>

Route Map:-