info.manatemples@mail.com

+91 9866933582

రేణుకా ఎల్లమ్మ ఆలయం, దర్వేశిపురం




అమ్మ వున్న చోట ఇష్టాలన్నీ తీరిపోతాయి ... కష్టాలన్నీ మాయమైపోతాయి. అందుకే అమ్మ తన బిడ్డల పాలిట ఓ కామధేనువులా కనిపిస్తుంది ... కల్ప వృక్షంలా అనిపిస్తుంది. అలాంటి అమ్మలకే అమ్మగా ... పెద్దమ్మగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు దర్శనమిస్తుంది. అమ్మా అనే పిలుపులోని అతి మధురాన్ని ఆస్వాదించడానికి ... బిడ్డలకి అండగా నిలవడంలో కలిగే ఆనందాన్ని అనుభవించడానికి అమ్మవారు ఊరూరా గ్రామదేవతగా ఆవిర్భవించింది. అలా ఆ తల్లి అందరి ఇలవేల్పుగా పూజలు అందుకుంటోన్న క్షేత్రం

నల్గొండ జిల్లా దర్వేశిపురం లో దర్శనమిస్తుంది. పూర్వం ఈ ప్రాంతానికి చెందిన పాలవ్యాపారులు పాల అమ్మకానికి బయలుదేరి వెళుతూ, ఇక్కడి పుట్టపై చుట్టచుట్టుకుని వున్న నాగుపాముని చూశారు. దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ పాము, తన చూపులతోనే వారిని ప్రభావితులను చేస్తూ పుట్టలోకి వెళ్లిపోయింది. అది దేవతా సర్పంగా భావించి, వాళ్లు ఆ పుట్టలో పాలుపోశారు.

ఆ రోజు నుంచి ఆ పుట్టలో పాలుపోసి పూజించడం అలవాటుగా మారిపోయింది. పుట్టలో పాలు పోస్తున్న దగ్గర నుంచి వారి వ్యాపారం ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. దాంతో గ్రామస్తులందరూ కూడా రేణుకా ఎల్లమ్మ తల్లే పాము రూపంలో తమని కాపాడుతూ వుందని విశ్వసించారు. అనుకున్నదే తడవుగా ఆ పుట్ట దగ్గరే ఆలయాన్ని నిర్మించి అమ్మవారి మూర్తిని ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి అమ్మవారు చూపే మహిమల సంఖ్య పెరుగుతూపోతూ వుంటే, భక్తుల సంఖ్య కూడా అంతే వేగంతో పెరుగుతోంది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తమ మనసులోని మాటను చెప్పుకుని ముడుపులు కడతారు. తమ కోరికలు నెరవెరాక మొక్కుబడులు చెల్లించుకుంటారు. అమ్మవారి ఆశీస్సులే తమని అనుక్షణం రక్షిస్తూ ఉంటాయని భక్తులు చెబుతుంటారు. నిరంతరం ఆ తల్లి సేవలో తరిస్తూ వుంటారు..
How to Reach:
Nalgonda జిల్లా కేద్రం నుండీ 11km