info.manatemples@mail.com

+91 9866933582

మల్లికార్జున స్వామి వారి ఆలయం,దావుపల్లి గ్రామం



గుంటూరు జిల్లా పల్నాడు వెల్దుర్తి మండలం నల్లమల్ల అటవీ ప్రాంతం లో ఉన్న దావుపల్లి గ్రామం లో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం: పురాతన కాలం నుండి ఈ ప్రాంతంలో శివలింగం ఉండగా చిన్న ఆలయం కట్టి గిరిజనులు పూజించసాగిరట.ఒకప్పుడు ఈ ప్రాంతంలో జనవాసాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి , చుట్టుకొండలు,చెట్లు,ఆహ్లాద ప్రకృతి మధ్య ఉండే ఈ దేవాలయం మాచర్ల నుండి శ్రీశైలం వెళ్లే రహదారికి దావుపల్లి సమీపంలో అటవి వాతావరణం లో ఉంటుంది, ఆ ప్రాంతం లో గిరిజనులు ఎక్కువగా నివాసం ఉంటారు,వారు భక్తి శ్రద్దలతో స్వామి వారిని పూజిస్తారు.


`

శివరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తారు.కార్తీక మాసం లో ప్రత్యేక పూజలు చేస్తారు.దావుపల్లి ప్రాంతం వన్య మృగ సంరక్షణ అధికారుల నియంత్రణ లో ఉంటుంది. అద్బుత నల్లమల్ల అటవీ దృశ్యాలు,ఆధ్యాత్మిక మల్లికార్జున స్వామి వారి ఆలయం ను సందర్శిస్తే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేము.ఇక్కడ స్వామి వారిని పూజిస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం అద్బుత నల్లమల్ల అటవీ దృశ్యాలు,ఆధ్యాత్మిక మల్లికార్జున స్వామి వారి ఆలయం ను సందర్శిస్తే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేము.అతి మహిమాన్విత మల్లికార్జున స్వామి వారి ఆలయం ను చూడని వారు తప్పక దర్శించండి

`
ప్రయాణ మార్గం:
మాచర్ల నుండి శ్రీశైలం(165 కి.మీ) వెళ్లే దారిలో దావుపల్లి అటవీ ప్రాంతం(మాచర్ల నుండి 45 కి.మీ) రోడ్డు పక్కనే ఈ ఆలయం ఉంటుంది