info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం,గుమ్మడిదాల, మెదక్ జిల్లా జిన్నారాం మండలం




శ్హైదరాబాద్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ జిల్లా జిన్నారాం మండలంలోని గుమ్మడిదాల గ్రామంలో కొలువైన దివ్యమైన శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం.దేశం లో యెక్కడ లేని విదంగా ఇక్కడ రామపరివారం సతీ సమేతంగా కొలువైన క్షేత్రం. ఒక చిన్న కొండ పైన కొలువైన దేదీప్యమానమైన రామ క్షేత్రం .రామ లక్ష్మణ భరత శత్రుగ్నులు సతీ సమేతంగా కొలువై ఉన్నారు.ఆలయమ లో హనుమ మనకు కనిపించడు.


ప్రతి నిత్యంస్వామి వారికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.అభిరుద్ది చేస్తే మాత్రం ఈ దేవాలయం యెంతో వెలుగొందుతుంది. నగరానికి సమీపం లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం ఈ ఆలయాన్ని సందర్శించి ఆలయాన్ని అందరికీ తెలిసేలా చేసి తిరిగి పునర్వైభవం తీసుకొని రావడానికి ప్రయత్నిద్దమ్.