info.manatemples@mail.com

+91 9866933582

కలిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం





చిత్తూర్ నుండి 12 కి మీ దూరం లో కలిగిరి కొండ పైన వెలసిన అతి పురాతన క్షేత్రం కలిగిరి కొండ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం. సముద్ర మట్టనికి 2000 అడుగుల ఎత్తులో ఇ క్షేత్రం కొలువై ఉంది..కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయమీది.




స్థల పురాణం ప్రకారం తిరుమల నుండి తిలక ఆకారంలో ఉన్న ఒక రాయిని తీసుకొని వచ్చి ఇక్కడ స్వామి వారి పాదాల చెంతన ఉంచారు అని ఒక కథనము...దేవతలే ఆ రాయిని తీసుకొని వచ్చి పెట్టినట్లు చెబుతారు.. అమ్మ వారు స్వామి వారు తిరుమల వెళుతూ ఇ ప్రాంతం లో ఉండి సేద తీరారు అని మరొక కథనం..దాని కారణంగానే ఇక్కడ కొలనకు సమీపం లో స్వామి వారి పాద ముద్రలు ఉన్నట్టు గాథ.ఆ శ్రీ మహావిష్ణువు కోసమే గంగమ్మ తల్లి ఇక్కడ పుట్టింది అని పుష్కారని లో స్నానమాచరించి భక్తులు పునీతిలు అవుతారు.




స్వామి వారికి మొక్కుగా ఇచ్చిన ఆవులు రాత్రి సమయం లో ఇక్కడ సేద తీరి ఉదయం అవ్వగానే అవి వాటి గమ్యస్థానాలకు చేరుకుంటాయట..ఎవరి ప్రమేయం లేకుండా అనాదిగా అలా జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి నిత్యం విశేషామైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి..పండుగలప్పుడు,ధనుర్మాసం లో విశేషామైన సేవలు నిర్వహించబడుతాయి. ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం. తిరుపతి నుండి కలిగిరి కొండ కు 55 కి మీ






Route Map:-