info.manatemples@mail.com

+91 9866933582

కోనేశ్వర్ ఆలయం - శ్రీలంక





శ్రీలంకలో అత్యంత పురాతనమైన హిందూ దేవాలయాల్లో ఇది ఒకటి. సముద్ర తీరంలో ఎంతో అహ్లదకరమైన వాతవరణంలో మనస్సుకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది.



భారత దేశం నకు దక్షిణ దిశగా, పొరుగు దేశం శ్రీలంక నందు శాంకరీదేవి పీఠం కలదు. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రతీతి. శ్రీలంక ద్వీపం నకు పశ్చిమ సముద్ర తీరాన కొలంబో రాజధాని ఉంటుంది. కొలంబో కు ఈశాన్యం దిశగా, సుమారు 255 కీ.మీ దూరాన, తూర్పు సముద్ర తీరప్రాంతములో ట్రింకోమలీ పట్టణం ఉంది. దీనికి సుమారు7 కీ.మీ దూరాన, తూర్పు సముద్ర తీరాన గల ఎత్తైన పర్వతం పైన కోనేశ్వరం క్షేత్రం కలదు. దీనిని " స్వామిరాక్" గా పిలుస్తారు. ఇచ్చట ప్రాచీన శైవాలయం దర్శించగలం. స్వామిని కోనేశ్వరుడు గా కొలుస్తారు. కోనేశ్వర్ మలై కు ప్రక్కన గల పర్వతం (మలై) పైన శాంకరీదేవి పీఠం ఉండేది. ప్రకృతి వైపరీత్యం వలన పీఠం శిథిలమైంది. కోనేశ్వరాలయం యొక్క ప్రాంగణములో అమ్మ వారికి ఒక సన్నిధి నిర్మించారు. శాంకరీదేవీకి నిత్యం అర్చనలు, సేవలు జరుగు చుంటాయి. ఆలయ ప్రాంగణములో అమ్మ వారి సన్నిధి తో పాటు గణేశ్, మురగన్, శక్తి, భద్రకాళి, సూర్య, విష్ణు తిరుమల మరియు రావణ బ్రహ్మ మొదలగు మూర్తులును దర్శించవచ్చును.




ఎలావెళ్లాలంటే..?
ట్రింకోమలీ నుంచి కోనేశ్వరం కు టాక్సీలు ఉంటాయి.