info.manatemples@mail.com

+91 9866933582

రామప్ప దేవాలయం-పాలంపేట్‌




రామప్ప దేవాలయం వరంగల్‌కు 77 కి.మీ దూరంలో ఉంది. పాలంపేట్‌లో ఈ రామప్ప దేవాలయం ఉంది. ఆనాడు పాలించిన కాకతీయుల కళా వైభవానికి రామప్ప దేవాలయం మచ్చుతునక వంటిది. ఈ దేవాలయానికి వన్నె తెచ్చే శిల్పాలను చెక్కిన రామప్ప పేరునే ఆలయానికి పెట్టారు. ఈ ఆలయాన్ని 1213లో కాకతీయ పాలకుడైన గణపతి దేవుడు నిర్మించారు. ఈ ఆలయంలో రుద్రేశ్వరా, కాటేశ్వరా, కామేశ్వరుల ఆలయాలు ఉన్నాయి. ఇవి కూడా శిథిలావస్థలో ఉన్నాయి. అలాగే మహాశివరాత్రి ఉత్సవాలు ఈ ఆలయంలో చాలా వైభవంగా చేస్తారు.

ఈ ఆలయాన్ని కట్టేందుకు ఉపయోగించిన ఇటుకలు నీటిలో వేస్తే మునగకుండా ఉండేంత తేలికగా ఉంటాయంటే ఎవరూ నమ్మరు. అయినప్పటికీ, ఆ కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ ఆలయం వెలుపల తొమ్మిది అడుగుల ఎత్తున్న నంది విగ్రహం మిమ్మల్ని ఆహ్వానిస్తుంటుంది. ఈ ఆలయపు గోడలు, పైభాగాలలో ఆలయానికి సంబంధించిన పురాణ గాధలు ఉంటాయి. తప్పకుండా ఈ ఆలయ పర్యటన మీ మనసులో ముద్రగా మిగిలిపోతుంది.