info.manatemples@mail.com

+91 9866933582

సంబటూరి చెన్నకేశవాలయం




కడప జిల్లా కమలాపురం తాలూకా సంబటూరు లోని శ్రీ లక్ష్మీ చేన్నకేశవ / లక్ష్మీనారాయణ స్వామి ఒకనాడు కడప సీమలో సంగమేశ్వరం (అనిమెల), మోపూరు భైరవేశ్వరాలయం(నల్లచెరువు) హత్యరాల(అత్తిరాల) మరియు పుష్పగిరి వంటివి క్షేత్రాలు శైవ మతానికి ప్రసిద్ద క్షేత్రాలుగా ఉండగా , గండికోట, సంబటూరు, వెయ్యినూతుల కోన, రంగనాథాలయం (పులివెందుల), తాళ్ళపాక మరియు ఒంటిమిట్ట క్షేత్రాలు శ్రీవైష్ణవ మతానికి అత్యంత ముఖ్యమైన క్షేత్రాలుగా ఉండేవి.

కడప జిల్లా కమలాపురం నుండి కోకటం వెళ్లే దారిలో వస్తుంది సంబటూరు గ్రామం. ఇక్కడి లక్ష్మీ చెన్నకేశవాలయం అత్యంత ప్రాచీనమైనది , మరియు ప్రాశస్త్యం కలది. సంబటూరుకే శ్రీభాష్యపురం అని మరో పేరు ఉన్నది. ఒకనాడు ఈ గ్రామము శ్రీవైష్ణవులకు అత్యంత విశిష్టమైనది. ఆలయ ప్రాంగణంలో ఒక్క లక్ష్మీ చెన్నకేశవ ఆలయం తప్ప మిగతా ఆలయాలు ఇప్పుడు శిథిలమై ఉన్నాయి.

స్థల పురాణం : పూర్వం చ్యవనముని ఆశ్రమం ఉండేది , ఆ చ్యవనాశ్రమం కాలక్రమేణా చమటూరు అయినదని అదే తరువాత కాలంలో సంబటూరు అయినదని స్థానిక చరిత్ర. విజయనగర రాజుల, మట్లి రాజుల ఏలుబడిలో ఈ ఊరు శ్రీవైష్ణవ క్షేత్రంగా వెలిసిల్లిందని, తెలుగునాటే కాక తమిళులకు కూడా ఈ క్షేత్రము ముఖ్యమైనదని ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నది.


ఈ మధ్యే పునరుద్దరింపబడ్డ ఈ లక్ష్మీ చెన్నకేశవాలయంలో గుడి ప్రాకారంపై, కళ్యాణ మండపం స్తంభాల మీద, అనుబంధ ఆలయాల గోడల మీద చాలా పురాతన శాసనాలు ఉన్నవి.
చుట్టుపక్కల చూడదగ్గ ఆలయాలు:
కుంట ఆంజనేయస్వామి ఆలయం – 0.5 కి.మీ
కమలాపురం కంచి వరదరాజస్వామి ఆలయం – 3 కి.మీ

చెప్పల్లి చెన్నకేశవాలయం, అగస్త్యేశ్వరాలయం, చెప్పలమ్మ(హేలాంబ) ఆలయం – 11 కి.మీ




వెళ్ళు మార్గం :-

ఈసారి కమలాపురం , కోకటం మీదుగా ప్రొద్దటూరు వెల్లేట్లైతే తప్పకుండా ఈ చారిత్రాత్మక దేవాలయాన్ని దర్శించండి...