info.manatemples@mail.com

+91 9866933582

పుష్కర స్నాన మహిమ


"జన్మ ప్రబృకియత పాపం స్త్రియావ పురుషేణ
పుష్కర్యోమాత్రశ్య సర్వయే ప్రణశ్యతి"
పుట్టినప్పటి నుంచి స్త్రీ, పురుషాదులచే చేయబడ్డ పాపాలన్నీ పుష్కరిణి నదిలో స్నానం చేయడం వల్ల నశించిపోతుందని, అంతేకాకుండా పూర్వ జన్మల పాపం, త్రికరణాదుల వల్ల చేసిన పాపాలన్నియూ నశించి మోక్ష ప్రాప్తి పొందుతారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. పుష్కర స్నానం చేయడం వల్ల అశ్వమేథయాగం చేసినంత పుణ్య ఫలితాన్నిస్తుంది.
నర్మదా నదిలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశిలో మరణం ఎంత మోక్ష ప్రదమో ఈ మూడింటి ఫలితం ఒక్క పుష్కర స్నానం చేయడం వల్ల కలుగుతుందని వేద ఋషులు చెబుతారు.
తొలిగా నదిలో దిగునప్పుడు రేగు పండంత మట్టి ముద్దలను నదిలో వేయాలి. హే... నదీమతల్లీ నీలో నేను స్నానమాచరిస్తున్నాను.... అందుకు నీవు ఆజ్ఞ ఇవ్వాల్సిందిగా ప్రార్ధన చేయాలి. నదికి నమస్కారం చేస్తూ....స్నానం చేసి తుంగభద్ర, వరుణ దేవునికి, బృహస్పతికి, విష్ణుమూర్తికి, భోళాశంకరునికి , బ్రహ్మాది దేవతలకు, వశిష్టాది మునులకు, గంగాది సర్వ నదులకు, సూర్యునికి ఆర్థ్యం ఇవ్వాలి.