|
Share This on Your Social Network
|
శ్రీ ధ్యాన ఆంజనేయ స్వామి దేవాలయం -కర్మన్ ఘాట్
క్రి శ 12 వ శతాబ్దం లో నిర్మించిన దేవాలయం ఇది . కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు ఈ ప్రాంతం
లో వేట కు వచ్చి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అతనికి శ్రీ రామ్ అనే శబ్దం
వినిపించింది . ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోడానికి వెతుకుతుండగా పద్మాసనం
వేసుకొని ,ధ్యాన ముద్రలో ఉండి దివ్యతెజో ప్రభలతో వెలుగొందుతున్న స్వామి వారి విగ్రహం
కనిపించింది . రాత్రి స్వామి వారు రాజు గారికి కలలో కనిపించి దేవాలయం నిర్మించమని ఆదేశించారట
. స్వామి వారి ఆదేశాల ప్రకారం దేవాలయాన్ని నిర్మించారు అని స్థల పురాణం చెబుతుంది .
17 వ శతాబ్దం లో ఔరంగజేబు గోల్కొండ దుర్గమును వశ పరుచుకొని ఈ దేవాలయమును ద్వంసం చేయుటకు
తన సైన్యాలను పంపగా వారు స్వామి వారి మహిమల చే దేవాలయ సరిహద్దులను కూడా చేరుకోలేకపోయారు
. అప్పుడే స్వయముగా అతనే వచ్చి సింహ ద్వారం చేరుకోగా చెవులు చిల్లులు పడేటట్లు శబ్దం
వినిపించెను
గర్భ గుడిలో నుంచి "హే రాజన్ మందిర్ తోడన హై తో పహలే తుం కరో మాన్ ఘాట్ అన్న మాటలు
వినిపించాయి . అప్పుడు ఔరొంగ జేబు " హే భగవాన్ తుం సమ్ హై తో తుమ్హారా సచ్చాయి బతావ్
" అనగా ఆలయం లో మెరుపువలె కంటి పుంజములు వీరజిమ్మబడి తాటి చెట్టు ప్రామానం తో స్వామి
వారి బయంకర రూపం కనిపించెను . అప్పట్నుంచి ఈ ప్రాంతానికి ఖర్మన్ ఘాట్ అనే పేరుతో ప్రసిద్ది
చెందింది . భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం స్వామి .
|
తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి దేవాలయం
భాగ్యనగరం లోని సైనిక్పురి సమీపంలోని సిఖ్ విల్లెజ్ దగ్గర పూర్వం తాడ్బంద్ గ్రామం ఉండేది.
అక్కడ వెలసిన వీరంజనేయుడే తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి దేవాలయంగ వెలుగొందుతున్నది .
ఈ గ్రామం లో ఎనబై సంవత్సరాల క్రితం పొదల్లో ఒక పెద్ద బండ రాయి బయటపడింది బండరాయి పైన
వీరంజనేయుడూ సుందర రూపం లో చెక్కబడి ధర్శనం ఇచ్చాడు.ఇక్కడే స్వామి వారి కోసం ఆలయాన్ని
నిర్మించారు. రామాయణ కాలం లో జాబిలి మహర్షి ప్రతిష్టించిన మూడు ఆంజనేయ విగ్రహాలలో ఇది
ఒకటి అని స్థల పురాణం.
|
|
|
|
|
|