|
Share This on Your Social Network
|
శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం - అర్ధగిరి
చిత్తూర్ జిల్లాలోని కాణిపాకం క్షేత్రం నుండి సుమారు 15 కి మీ దూరం లో అరకొండ గ్రామం
లో 2కి మీ ఎత్తైన కొండ పైన వెలసిన క్షేత్రం శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవాలయం
.దేవాలయం లో ఉన్నసంజీవరాయ పుష్కరాని ఉంది .సహజ సిద్దంగా ఏర్పడిన పుష్కరాని కావడం వాళ్ళ
నిల్లు ఎప్పుడు స్వచ్చంగా ,ఏ కాలం లోను ఇంకిపోకుండా ఉంటాయి. క్షేత్రం త్రేతా యుగం నాటిదైన,దేవాలయం
మాత్రమూ చోళ రాజుల కాలం లో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి .
రామ రావణుల యుద్ద సమయం లో లక్ష్మణుడు ముర్చ్బోయినప్పుడు ఆంజనేయుడు సంజీవని కోసం వెళ్లి
మొత్తం పర్వతాన్ని తీసుకోని వస్తు ఉండగా మార్గ మద్యం లో ఈ ప్రాంతానికి వచేసరికి అర్ధకొండ
విరిగి పెలపెలరావంతో నేలమీద పడింది . ఆ కొండ పడిన ప్రాంతమే అర్ధగిరి . .ఆ ప్రాంతం లో
ఒక గ్రామం వెలసింది , ఆ గ్రామమే అరకొండగా రూపాంతరం చెందింది అని చెబుతుంటారు. అందువలనే
ఇక్కడ మొలసిన మొక్కలు సంజీవిని ల పని చేస్తాయి అని స్థల పురాణం చెబుతుంది .
ప్రతి నెల పవిత్రమైన పౌర్ణమి రోజున విశేష పూజ కార్యక్రామాలు నిర్వహించాబడుతాయి .
వెళ్ళు మార్గం :-
చిత్తూర్ నుండి ,కాణిపాకం నుండి ఈ క్షేత్రానికి వెళ్ళడానికి బస్ సర్వీస్ లు ఉంటాయి
www.Maps-Generator
|
|
|
|
|
|