లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం- చీర్యాల
రంగ రెడ్డి జిల్లా కీసర మండలం లో చీర్యాల గ్రామంలో అందమైన ప్రకృతి లో వెలసిన క్షేత్రం
లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం !! స్వామి వారితో పాటు చెంచు లక్ష్మి మాత కొలువై ఉన్నది
. లక్ష్మి నృశిమున్ని దర్సనం సకల రోగ నివారని !! సకల అరిష్టాలు తొలిగిపోతాయని భక్తుల
నమ్మకం. శ్రీ మహావిష్ణువు ఆలంకార ప్రియుడు ఇక్కడ స్వామి వారికే చేసే అలంకరణ చూడడానికి
వేయి కన్నులు కూడా సరిపోవు !! ఆలయ ప్రాంగణం లో అందమైన పుష్కరిణి ఉంది !! ఆదివారాలు
,పౌర్ణమి ,అమావాస్య సమయాల్లో భక్తులు బాగా వస్తుంటారు ॥
ఆలయ ప్రాంగణం లో వివిధ రకాల దేవాలయాలు ఉన్నాయి.
విజ్ఞేశ్వర స్వామి ఆలయం
ఆంజనేయ స్వామి ఆలయం
వల్లి దేవాసేన సమేత సుబ్రమణ్య స్వామి
గృహబాధలు, గ్రహబాధలు, ఆర్ధిక, ఆనారోగ్యబాధలు తదితర సమస్యలేమున్నా ఇక్కడికి వచ్చి లక్ష్మి
నరసింహుడికి,గణప్తికి, ఆంజనేయుడికి, బాగారు మైసమ్మ,నల పోచమ్మ అమ్మవర్లకు, నాగదేవతకు,
41 ప్రదిక్షణలు చేస్తే అవి తీరిపోతాయని భక్తుల నమ్మకం. మనసులో కష్టాని చెపుకుని, వాటిని
దూరం చేయమని కోరి కోబరీకాయ కొట్టి వేయడం ఆనవాయితి . అంతా స్వామి వారే చూసుకుంటారు .
ఆదివారం ఉదయమే ప్రదిక్షణలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది
శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం హైదరాబాద్ బస్ స్టేషన్ కు సుమారు 24 కి.మీ.
దూరంలో, Secuderabad రైల్వే స్టేషన్ నుండి 11 కి.మీ. & రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం,
హైదరాబాద్ నుండి 45 కిలోమీటర్ల నుండి దూరంలో కలదు.
Route Map :-