Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీ నేట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం




అనంతపురం జిల్లా గుంతకల్ జంక్షన్ దగ్గర లో ఉన్న ఈ క్షేత్రం .


క్రీ .శ . 1521 సంవత్సరం లో శ్రీ వ్యాసరయలవారు(తదనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి ,మంత్రాలయం ) హంపి క్షేత్రం లో తుంగభద్రా నది తీరం లో కర్మనుష్టానం చేస్తూ తను ధరించే గంధం తో తన ఎదురుగా ఉన్న శీలా పైన ఆంజనేయ స్వామి రూపం చిత్రించాడు . అది నిజ రూపం దరించి వెళ్తూ ఉంది . ఈ విధంగా అయదు సార్లు చిత్రించగా అదే విదంగా జరిగింది . చివరికి శ్రీ వ్యాసరయలవారు అంజనేయ స్వామి వారి ద్వాదశ నామ బీజాక్షరం తో యంత్రం రాసి దానిలో శ్రీ స్వామి వారి నిజరూపం చిత్రించగా స్వామి వారు ఆ యంత్రం లో బందిన్చాబడినారు . .


అప్పుడు స్వామి వారు వ్యాస రాయల వారు స్వప్నం లో స్వామి కనిపించి నేను ఈ క్షేత్రం లో ఉన్నాను దాన్ని తీసి ప్రతిస్టించమని చెప్పగా .. వ్యాసరయలవారు ఈ ప్రాంతాన 732 ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిస్తించాడట. చిప్పగిరి గ్రామం లోని శ్రీ భోగేశ్వర స్వామి గుడి లో వ్యాసరయలవారు నిద్రిస్తుండగా నేను ఇక్కడ నుండి దక్షిణ దిక్కుగా కొద్దిరుపం లో భూమి లో ఉన్నాను నన్ను తిరిగి ప్రతిస్టించమని పలికారు . వ్యాసుల వారు దారి చూపించమని అడగగా ఆంజనేయుడు ప్రస్తుతం నా పైన ఎండిన వేప చెట్టు ఉంది అది నువ్వు రాగానే పచ్చగా చిగురిస్తుంది అని మార్గం సూచించారు .


వ్యాసరాయల వారు కసపురానికి విచ్చేసి శ్రీ స్వామి వారి మిద ఉండే వేప వృక్షానికి సమీపించగానే అది పచ్చగా చిగురించింది అప్పుడు వ్యాసుల వారు ఆ ప్రాంతాన్ని తవ్వించి ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిస్టించాడు అని స్థల పురాణం చెబుతుంది . కసాపురం గ్రామానికి దగ్గరగా ఉండటం వలన కసాపురం ఆంజనేయ స్వామి అని కూడా పిలుస్తారు . నెట్టి కల్లు ( మంచి రాయి ) లో అవిర్బవిన్చినందున శ్రీ స్వామి వారికి నేట్టికంటి ఆంజనేయ స్వామి అనే పేరు ప్రసిద్దమైనది.


నేట్టికంటి అనగా ఒక కన్ను కలవాడని అర్థం . విగ్రహం లో స్వామి కుడి కంటి తో భక్తులను చూస్తూ వారి మనోభిస్టాలను నెరవేరుస్తున్నారు . స్వామి వారు కోరిన కోరికలు, వారి భాదలను తీర్చే కొంగు బంగారం.








Route Map:-

www.Maps-Generator