|
Share This on Your Social Network
|
సప్తముఖ ఆంజనేయ స్వామి దేవాలయం -లోంక క్షేత్రం
బుద్దిర్బలం యశో ధైర్యం నిర్బయత్వం మరోగతం
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్
చక్కని ఆలోచనను సరైన వేళలో అందించగల బుద్ధీ, ఆ ఆలోచనలను అమలుచేయగల మనోబలం. అలా అమలుచేసి సత్ఫలితాన్ని సాధించినందువల్ల చక్కని కీర్తి. ఇలాంటి కీర్తిని సాధించిన కారణంగా మరో మంచిపనిని కూడా సాధించగలమనే ధైర్యం, అలా ధైర్యంగా పనిచేస్తున్నందు వల్ల భయం లేనితనం.
ఆంజనేయుణ్ణి స్మరిస్తూ చేస్తున్నందువల్ల శరీర రోగం రానితనం, మనసుకు ఏవిధమైన జడత్వం(నిరాశ నిస్పృహ) లేనితనం, మనసు చురుకుగా ఉన్నందువల్ల మాటల్లో గట్టిదనం. ఇవన్నీ మనస్ఫూర్తిగా ఆంజనేయుణ్ణి స్మరించినందువల్ల లభిస్తాయి.
హైదరాబాద్ నుండి సుమారు 70 కి మీ దూరం లో ఒక చిన్న గ్రామం లో వెలసినా మహిమన్మితమైన ఆంజనేయ క్షేత్రం . రంగారెడ్డి జిల్లా లోని పరిగి పట్టనణానికి సమీపం లో కాలాపూర్ అటవి ప్రాంతం లో వెలసిన శక్తి వంతమైన హనుమాన్ క్షేత్రం .త్రేతా యుగం లో శ్రీ రాముడు,సీత దేవి,లక్ష్మణుడు తిరిగినట్లు పురాణాల్లో వివరించడం జరిగింది .
సప్త ముఖ ఆంజనేయ స్వామి దేవాలయం లో ఏడు రాతి పలకలకు చందనం తో అలంకరిస్తారు. ఆలయానికి ముందు బాగం లో చిన్న పుష్కరిణి ఉంది అక్కడ స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటే సకల రోగాలు ,ధరిద్రాలు పోతాయని భక్తుల విశ్వాసం. పవిత్రమైన ఈ ప్రదేశం లో ఎల్ల కాలం నిటి ప్రవాహం ఉన్నందు వలన సప్త వ్రుషులు తపస్సు చేసారని పురాణం గాథ !! ఒకప్పుడు ఇ ప్రాంతమంతా దట్టమైన చెట్లతో అడవిలా ఉండేది. సప్త వ్రుషులకు స్వామి వారు ప్రత్యక్షమై ఇక్కడే సంచరిస్తూ ఉంటాను అని అభయం ఇచ్చాడు అని పురాణం గాథ !!
వెళ్ళు మార్గం : హైదరాబాద్ నుండి పరగి వెళ్ళే మార్గం లో రంగాపూర్ అనే గ్రామానికి అతి సమీపం లో ఈ క్షేత్రం ఉంటుంది !!
ఇదే మార్గం లో మనకు దర్శనమిచ్చే అతి పురాతనమైన దేవాలయాలు :-
వెంకటేశ్వర స్వామి దేవాలయం -చేవెళ్ళ
అనంత పద్మనాభ స్వామి దేవాలయం -అనంతగిరి
రామలింగేశ్వర స్వామి దేవాలయం -దామగుండం
యోగానంద నరసింహ స్వామి దేవాలయం -రాకంచెర్ల
|
|
|
|
|
|