info.manatemples@mail.com

+91 9866933582

వీరభద్ర స్వామి దేవాలయం, మద్దూరు, మనోపాడు మండలం,జోగులంబ గద్వాల్ జిల్లా





జోగులంబ గద్వాల్ జిల్లా లోని మనోపాడు మండల కేంద్రం లో గల మద్దూరు లో కొలువైన వీరభద్ర స్వామి దేవాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. గద్వాల్ ను పారిపాలించిన రాజులు ఇ దేవాలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.ఇ ఆలయ అవరన లో అయిదు భావులుండేవి ఆట..ప్రస్తుతం రెండు మిగిలనాయి..గద్వాల్ రాజులు ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళాల్సివచిన్నప్పుడు ఇ క్షేత్రానికి వచ్చి ఆ భావుల నుంచి జలాన్ని తీసుకొని వచ్చి స్వామి వారికి అభిషేకం చేయించుకొని వాటిని ఆయుధాల పైనా చల్లే వారట.. అలా గద్వాల్ రాజులకు స్వామి వారి పైన చాలా భక్తి ఉండేదట... ఆలయము లో వీరభద్ర స్వామి తో పాటు మహాదేవుడు, చౌడేశ్వరి అమ్మ వారు,గణపతి కొలువై నారు..స్వామి వారికి ప్రతినిత్యం జరిగే పూజా కార్యక్రమాల తో పాటు సోమవారం,అమావాస్య లకు విశేషమైన పూజలు ర్వహించబడుతాయి...



ఆలయానికి 1 కి మీ దూరం లో తుంగభద్ర నది తీరం కొలువై ఉంది..శ్రావణమాసం లో,కార్తీక మాసం లో నది స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకొని అయిన కృపకు పాత్రులవుతారు... ఆలయానికి సమీపం లో కొలువైన బసవేశ్వర స్వామి కి నది నుంచి తీసుకొని వచ్చిన జలాలతో అభిషేకం చేస్తే అంతా శుభమ్ జరుగుతుంది అని భక్తుల విశ్వాసం.పెళ్లి కాని వారు,మంచి సంతానం కోసం చాలా మంది భక్తులు స్వామి ని దర్శించుకుంటారు.ఆలయం చూడడానికి చిన్నగా కనిపించిన ఎంతో ప్రసాస్త్యమైన క్షేత్రం.


ఎలా వెళ్ళాలి: కర్నూల్ నుండి రాయచూరు వెళ్లే బస్ లో మద్దూరు పైగా వెళ్తాయి.