info.manatemples@mail.com

+91 9866933582

సంపూర్ణ నవగ్రహ ఆలయం –రాంపూర్, తొగుట మండలం,మెదక్ జిల్లా




భూమిపై ఉండే ప్రతి మానవుని నవగ్రహాలు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని మంచి,కొన్ని చెడు ఇలా రక రకాల ప్రభావాలు మనకు కలుగుతూ ఉంటాయి .
మెదక్ జిల్లా తొగుట మండలం రాంపూర్ గ్రామం లో శ్రీ గురు మదననంద శారద పీఠంలో నిర్మించబడింది. దేశం లో ఎక్కడ లేని విదంగా నవగ్రహాలు ,అధిదేవత ప్రత్యాది దేవతలు ,సద్గున్యాది దశ దిక్పలకులతో సహా కొలువయి ఉన్నారు . మొత్తం 64 మంది దేవతలు ఇక్కడ మనకు కనిపిస్తారు సంపూర్ణ నవగ్రహ మండలి కొలువైన దేవాలయం మనకు ఎక్కడ కనిపించదు . ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయం మరి యు ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉండే స్పటిక లింగం ఉంటుంది.


ఆ నవగ్రహాల అనుగ్రహానికి చేయవలసిన పూజలు /వ్రతాలూ :-
సూర్యగ్రహ అనుగ్రహముకు రథసప్తమి, శ్రీరామనవమి, కేదారేశ్వర, సూర్య చంద్ర వ్రతము చేయాలి. అలాగే చంద్ర గ్రహానికి అమావాస్య సోమతి వ్రతం, కృష్ణాష్టమి వ్రతం, సోమవార వ్రతం, కజుడు అనుగ్రహానికి నాగుల చవితి, నాగ పంచమి, అంగారక చవితి, కాత్యాయనీ వ్రతము, కుజగౌరీ వ్రతము చేయాలి. బుధుడు అనుగ్రహానికి శ్రీ అనంత పద్మనాభ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, తులసీ వ్రతము, గురు గ్రహానికి శ్రీ సత్యసాయి వ్రతము, శ్రీ సత్యదత్త వ్రతము, త్రినాథ వ్రతాలను చేయాల్సి ఉంటుంది.
అలాగే శుక్రుడు అనుగ్రహానికి వరలక్ష్మీ వ్రతం, వైభవలక్ష్మీ వ్రతం, శ్రీలక్ష్మి కుబేర వ్రతం, సంతోషిమాత, అనఘాదేవి వ్రతాలను చేయాలి. శని గ్రహం అనుగ్రహానికి హనుమద్వ్రతము, శివరాత్రి, శనైశ్చర వ్రతాలు, రాహు గ్రహానికి శ్రీదేవి నవరాత్రి, సావిత్రీ, షోడశగౌరీ వ్రతం, కేతువు అనుగ్రహానికి వినాయక చవతి, సంకష్టహర చతుర్థి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలింత వుంటుందని సిద్ధాంతాలు చెపుతున్నాయి.
.


వెళ్ళు మార్గం :-
వెళ్ళు మార్గం : మెదక్ జిల్లా తొగుట మండలం రాంపూర్ గ్రామం
Route Map:-