Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

హనుమ క్షేత్రం-సువర్ణపురి - సొన్




మహారాష్ట్రలో ని నాసిక్ కి 18 కి మీ దూరం లో గల సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో త్ర్యంబకేశ్వరం వద్ద బ్రహ్మగిరి శికారం పైన జన్మించి త్ర్యంబకం లో ని గోముఖం గుండా సన్నని ధారా ప్రవాహంగా గోదావరి ప్రారంబం అవుతుంది . అలా ప్రవహిస్తూ చిన్న చిన్న వాగులు,వంకలు ,ఉపనదులను కలుపుకుంటూ తెలంగాణాలోని నిజామాబాదు జిల్లలో లో కందుకుర్తి దగ్గర తెలుగు నెలా పైన అడుగిడుతుంది . హరిద్ర ,మంజీరా లను కలుపుకొని చదువుల తల్లి బాసర లో జ్ఞాన సరస్వతిని ముద్దాడి , కరీంనగర్ లోని ధర్మపురి,కాళేశ్వరం లోని ముక్తేశ్వర ని దర్శించుకొని ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి లో రాముల వారిని సేవిస్తూ మెల్లగా అడుగులేస్తూ తెలంగాణా నెలా పైన సెలువు తీసుకోని ఆంధ్ర ప్రదేశ్ లో అడుగిడి పాపికొండ ల మద్య ఆటలాడుతూ ,పాటలడుతూ పట్టిసీమ వీరభద్రుని చెంతలో చేరి పిమ్మట రాజమహేంద్రవరానికి చేరుకొని అక్కడ సేద తీరి చివరగా అన్త్రవేది నరిసంహ స్వామి దర్శించుకొని సముద్రం లో కలిసిపోతుంది. గోదావరి నది ఏడు పాయలుగా వీడిపోయి సముద్రం లో కలుస్తుంది. అందమైన గోదావరి నది లో ప్రయాణం ,ఆ నీళ్ళలో ఉన్న మహత్యం మనకు దొరకడం మన తెలుగు వాళ్ళం ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలమో .


ఆదిలాబాద్ జిల్లా సొన్ గ్రామం లో వెలసిన హనుమ క్షేత్రం చాల పవిత్రమైనది. మరియు ఇక్కడ ప్రవహించే గోదావరి నదిని వృద్ద గంగా అని కూడా అంటారు . సీతారామచంద్ర స్వామి వనవాస సమయం లో ఇక్కాడ సంచిరించారని స్థల పురాణం . ఈ క్షేత్రాన్నే సలేగ్రమ క్షేత్రము అని కూడా అంటారు. ఇక్కడ పరుశారాముడు యాగాలు నిర్వహించాడని చెబుతుంటారు . ఇక్కడ గోదావరి పుష్కరాల సమయం లో బక్తులు చాలామంది వస్తుంటారు .మధ్వ బ్రహ్మిన్స్ ఇక్కడ బాగా వస్తుంటారు .. ఇక్కడ మూల రాముడు ఆశిస్సులు తీసుకోడానికి .











Route Map:-

map generator