|
Share This on Your Social Network
|
హనుమదీశ్వర ఆలయం- సురేంద్రపురి
నల్లగొండ జిల్లాలోని యాదగిరి గుట్టకు సమీపంలో గల ఈ సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం తప్పక దర్శించదగిన క్షేత్రం. కళకు పెద్దపీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం వెనుకనుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు. ఈ దేవాలయ ముఖద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది.
నవ గ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, అధి దేవత, ప్రత్యధి దేవతల సమేతంగా విడివిడిగా తొమ్మిది ఆలయాలను ఇక్కడ నిర్మించారు. పంచముఖ హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వరస్వామి ఈ దేవాలయంలో కొలువుతీరి ఉన్నారు.
ఆంజనేయస్వామిని కొలిచిన వారికి మానసిక దౌర్భల్యం నశించి, మనోధైర్యం సిద్ధిస్తుంది. బుద్ధి, బలం, శక్తి, యశస్సు, ఆయురారోగ్యాలు చేకూరతాయి. వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.
అమ్మవారి వాహనం సింహం నోటినుండి కళాధామానికి ఏర్పాటు చేసిన ప్రవేశమార్గం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నప్రధాన దేవాలయాల మినీ రూపాలు ఉన్నాయి. వీటిలో విజయవాడ కనకదుర్గ ఆలయం, షిర్డి సాయిబాబా గుడి , తిరుమల వెంకటేశ్వర ఆలయం.
కొండపైన స్వామి వారి పుష్కరాని కూడా ఉంది . ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే సకల కష్టాలు,
రోగాలు నాయమయిపోతాయని బక్తుల నమ్మకం . గర్భ గుడి లో లక్ష్మి నరసింహుల ఉత్సవ విగ్రహాలు ఉన్నయీ. గోదాదేవి మందిరం కూడా ఉంది . ఆలయ ఆవరణ లో గల అద్దాల మండపం , కొండ పైన ఉన్న శివాలయం తప్పకుండ చూడదగినవి .
సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం పరిసర ప్రాంతాల్లో చూడదగ్గది కళాధామం. ఈ ప్రదేశాన్ని చూడాల్సిందేగానీ, చెప్పేందుకు అలవికానట్టిదిమొత్తం ఈ ప్రదేశాన్నంతా కలియదిరిగేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుంది.
ఈ క్షేత్రంలోనే నాగ కోటిస్వరలయం నిర్మించారు ,నాగ దోషం ,కాలసర్ప దోషం ,కుజ దోషాలు అనను భక్తుల కోసమే ఈ దేవాలయాన్ని నిర్మించారు . ప్రతి ఆలయం లో ఒక మూలా విగ్రహం ఉంటుంది కాని ఇందులో కోటి పార్థివ లింగాలను నాగప్రతిమ తో చేసిన కోటి సర్పాల ప్రతిమలు ఉన్నాయి . కాబట్టే దీనిని నాగాకోటిస్వరలయం అంటారు .
వెళ్ళే మార్గం : హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది
రాయ్గిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు, వరంగల్, నల్గొండల నుంచి చాలా బస్సులు కలవు
|
|
|
|
|
|