శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో అయదవది వామనావతారం. వామనుడికి దేవాలయాలు చాల అరుధు. అలాంటి అవతారానికి పురాతన మహిమన్మితమైన దేవాలయం మన రాష్ట్రము లో గుంటూరు జిల్లాలోని బాపట్ల కు 19 కి మీ దూరం లో గల చెరుకూరు గ్రామం లో కొలువై ఉంది . చాళుక్యుల కాలం లో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తంది .
శతాబ్దాల చరిత్ర గల ఈ త్రివిక్రమ వామన దేవాలయం లో వామనుడి దర్శనం ఎంతో అద్బుతంగా,రమణీయంగా ఉంటుంది.
త్రివిక్రమ ఆలయ ఆవరణ సమీపం లోనే అగస్త్య మహాముని చే శివలింగాన్ని ప్రతిస్టించబడిన శివాలయం కలదు.ఈ ఆలయం లో 4 అడుగుల ఎత్తు గల శివలింగం దర్శనం ఇస్తుంది .
పురాతన ,మహిమన్మితమైన, అరుదైన ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు జీవితం లో ఒకసారి అయిన దర్శించి తీరాల్సిందే !!
వెళ్ళు మార్గం : బాపట్ల నుండి 19 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంటుంది