మత్స్యగిరింద్ర స్వామి దేవాలయం -కొత్తగట్టు
హిందూమతం పురాణాలలో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం.
మత్స్యం అనగా చేప. ఈ అవతారంలో విష్ణువు రెండు పనులు చేసినట్లుగా పురాణ గాధ (1) ప్రళయకాలంలో
జీవరాసులను నావలో జలనిధిని దాటించడం. (2) వేదాలను కాపాడడం.
సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయంసంధ్యలో రవ్వంత కునుకు తీసెను. ఇదే అదనుగా
చూసుకొని హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోకి
ఉరుకెత్తాడు. శ్రీమన్నారాయణుడు మత్స్యరూపంలో ఆ రాక్షసుని వెదకి, చంపి, వేదములను తిరిగితెచ్చి
బ్రహ్మకిచ్చాడు. మత్స్య రూపం లో శ్రీ మహా విష్ణువు మనకు ధర్శనం ఇచ్చే క్షేత్రాలు మన
దేశం లో చాల అరుదు .
కరీంనగర్ జిల్లా కేంద్రానికి 30 కి మీ దూరం లో వరంగల్ -కరీంనగర్ రహదారి పైన కొత్తగట్టు
గ్రామా మ లో వెలసిన మత్స్యగిరింద్ర స్వామి దేవాలయం 11 వ శతాబ్దానికి చెందింది అని చరిత్ర
చెబుతున్నది .కాకతీయుల కాలం లో నిర్మించబడినది అని శాసనాల ద్వారా తెలియడం జరుగుతుంది
. స్వామి వారు ఇక్కడ స్వయం భు గ వెలసి శ్రీదేవి ,భూదేవి సహితంగా వెలిసాడు అని పురాణం.
స్వామి వారి ఆలయ ప్రాంగణం లో గుట్ట పైన ఉన్న కోనేరులో స్నానం అచారించి స్వామి వారిని
దర్శించుకుంటే పాపాలను హరించి కోరిన కోరికలు నేరవేరుస్తాడని బక్తుల విస్వాశం .
మాఘ మాసం లో పౌర్ణమి రోజు ఇక్కడ ఉత్సవాలు మొదలై 12 రోజుల పాటు జరుగుతాయి . శ్రీ మత్స్యగిరింద్ర
స్వామి కి వైభవంగా కల్యాణం జరిపిస్తారు . ఈ ఉత్సవాలను వీక్షించడానికి మన రాష్ట్రము
లోనే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు .
ఆలయ ప్రాంగణం లో
ఆంజనేయ స్వామి దేవాలయం
శివాలయం కూడా ఉన్నాయి .
వెళ్ళు మార్గం :
కరీంనగర్ నుండి 30 kms దూరం లో కొత్తగట్టు
వరంగల్ -కరీంనగర్ రహదారి పైన కొత్తగట్టు గ్రామా మ