శ్రీ కుర్మనాథ స్వామి దేవాలయం - శ్రీ కూర్మం
శ్రీకాకుళం కి 13 కి మీ దూరం లో గల శ్రీ ఖుర్మం గ్రామం లో వెలసిన ప్రాచిన దేవాలయం ఇది
. కాళింగ రాజులూ ఈ దేవాలయాన్ని నిర్మించారు .
ఉత్తరంద్ర ప్రదేశాన్ని శ్వేతా చక్రవర్తి పరిపాలించు చుండేవాడు . అతని బార్య మహా విష్ణు
బక్తురాలు . ఏకాదశి వ్రతం చేస్తున్న రోజున రాజు వారు కమోద్రకుడై ఆమెను సమిపించగ ,ఆమె
గ్రహించి ,తనను రక్షించమని శ్రీ మహా విశునువ్ని ప్రర్తించగా వెంటనే మహా విష్ణువు ఆమె
మొరను ఆలకించి దంపుతల ముందు ఒక నదిని ప్రవహింప చేసి ఆపద నుండు ఆమెను కాపాడాడని అదీ
తరువాత వంశాదార నది గ మారినది అని స్థల పురాణం చెబుతుంది .
రాజు వారు తరువాత తన తప్పును గ్రహించి పాపా పరిహర్థం మహా విష్ణువు ప్రార్థించా గా స్వామి
వారు ని పాపా పరిహర్థం తనకు గుడిని నిర్మించమని చెప్పగా అప్పుడు రాజు వారు కుర్మరుపని
ప్రతిష్టించి అరాదించారని అదీ కుర్మనాథ స్వామి దేవాలయం గ ప్రసిద్ధికి ఎక్కింది అని
పురాణం చెబుతుంది
తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం నందు శ్రీ కుర్మనాతుడు పడమర ముఖంగా ఉండటం విశేషం తూర్పున
ఒక ధ్వజ స్థంబం ,పడమర ఒక ధ్వజ స్థంబం ఉన్నాయి . వైష్ణవ క్షేత్రం కావడం వలన ఆగమ శాస్త్ర
నియమ ల ప్రకారం రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయ్.
వైశాక మాసం లో వచ్చే పౌర్ణమి రోజున కుర్మా జయంతి ని నిర్వహిస్తారు . అ రోజు స్వామి
వారికి విశెసమైన పూజ కార్యక్రమాలు,అభిషేకాలు ,అర్చనలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు
.
Route Map: