info.manatemples@mail.com

+91 9866933582

సౌమ్యనాథ స్వామి దేవాలయం -నందలూరు




కడప జిల్లాలోని నందలూరు లో 11 వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం నిత్యం బక్తులతో కిట కితలడుతూ కోరిన కోరికలను తీర్చె దైవంగా సంతన సౌమ్యనాతునిగా ప్రసిద్ది గాంచాడు . కడప - తిరుపతి మార్గంలో కడప నుంచి 40 కి.మీ. దూరంలో నందలూరు చెయ్యేటి (బాహుదానది)కి ఎడమ గట్టున ఉంది.


11వ శతాబ్దంలో చోళవంశరాజులచే నిర్మించబడిన ఆలయం. సంతాన సౌమ్యనాథునిగా, వీసాల సౌమ్యనాథునిగా ప్రసిద్ధికెక్కాడు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో 108 స్తంభాలతో చోళ కళాశిల్ప నైపుణ్యానికి ప్రతీక. . 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఆలయానికి గాలిగోపురం కట్టించి నందలూరు, ఆడపూరు, మందరం, మన్నూరు, హస్త వరం అయిదు గ్రామాలను సర్వమాన్యంగా ఇచ్చినట్లు శాసనాలు ఉన్నాయి.


కలియుగ దైవం ఆయన వెంకటేశ్వర స్వామి కి కతికహస్థమున్దగ సౌమ్యనాథ స్వామి కి అభయ హస్తం ఉంది . స్వామి వారి దివ్య మంగళ విగ్రహం ఎంతో అద్బుతంగా ఉంటుంది . స్వామి వారి ఆలయా నిర్మాణానికి యెర్ర రాయిని వినియోగించారు . ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి, కోర్కెను మొక్కుకుని, 108 ప్రదక్షిణలుచేస్తే, నెరవేరుతుందని భక్తుల నమ్మకం.




ఈ ఆలయ ప్రాంగణంలో యోగ నరసింహ, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు ఉన్నారు. ఆలయం గోడల మీద మత్స్య, సింహ చిహ్నాలున్నాయి. గర్భగుడి ముందు ఆలయం కప్పు పై చేప బొమ్మ ఉంది. జలప్రళయం వచ్చి నీరు చేపను తాకినప్పుడు చేప సజీవమై నీటిలో కలిసిపోతుందట. ఆలయ నిర్మాణానికి ఎర్రరాతిని ఉపయోగించారు. ఈ సౌమ్యనాథుని చొక్కనాథుడు అంటారు. ఆదికవి నన్నయ ఈ సౌమ్యనాథుని దర్శించి సేవించాడు. నందలూరుకు 5 కి.మీ. దూరాన తాళ్ళపాక ఉంది. తాళ్ళపాక అన్నమాచార్యులు కూడా చొక్కనాథుడిని సేవించాడు.


ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించెదరు



Route Map