info.manatemples@mail.com

+91 9866933582

వెంకటేశ్వర స్వామి దేవాలయం-ఘనపూర్ ,వెంకటేశ్వర గుట్ట




సికింద్రాబాద్ నుండి సుమారు 25-30 కి మీ దూరం లో ఉన్న ఘనపూర్ గ్రామం లో గుట్ట ( షామీర్ పేట కి సమీపం లో ) పైన వెలసిన వెంకటేశ్వర స్వామి దేవాలయం చాల పురాతనమైనది . గుట్ట పైన ఒక రాయి పైన స్వామి వారు స్వయం భు గా వెలిశారు . ప్రశాంతమైన వాతవరణం ,చుట్ట అందమైన పచ్చదనం మనకు ఎంతో ఆహ్లాదాన్ని ,ఆధ్యాత్మికత భావనలోకి తీసుకెళ్తుంది . అలవేలు మంగా ,పద్మావతి సమేతంగా కొలువై ఉన్నారు ఇక్కడ స్వామి వారు కొలువై ఉన్నారు.


స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న రెండు పెద్ద రాళ్ల మద్య లో వీరభద్ర స్వామి కొలువై ఉన్నాడు స్వామి వారి ఆలయానికి ప్రక్కనే ఉన్న మరో ఒక రాయి పైన పుర్వము ఒక మహర్షి నిలబడి తపస్సు చేసాడని స్థల పురాణం .


ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయం లో స్వామి వారికి ఉత్సవాలు నిర్వహించాబడుతాయి . ఆ సమయం లో చాల మంది భక్తులు పాల్గుంటారు .


ఆలయం దిగువ బాగాన నవగ్రహ దేవాలయాలు ఉన్నాయి . ఇక్కడ నిర్మించిన దేవాలయాల్లో నవగ్రహాలు సతి సమేతంగా ప్రతిష్టిన్చబడ్డాయి . నవగ్రహ దేవాలయాలతో పాటు


శివాలయం
గణపతి దేవాలయం
నాగదేవత ఆలయం
ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి .


గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడ దోష పరిహారార్థం శాంతి పూజలు, హోమాలు ,ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు . ప్రతి ఒక్కరు తప్పకుండ ధర్సించనీయమైన క్షేత్రం ఇది .


కాల భైరవ స్వామి దేవాలయం -భైరవగుట్ట





ఘనపూర్ గుట్ట నుండి గండి మైసమ్మ వచ్చే మార్గం లో రావాలకోలే గ్రామం లో ఒక ప్రైవేటు ఫార్మ్ హౌస్ లో గుట్ట పైన వెలసిన కాలభైరవ స్వామి చాల శక్తివంతమైన దైవం . ఆలయ ఆవరణ ప్రాంగమ లో శనీశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు .


ప్రతి శని వారాల్లో , శని త్రయోదశి కి ప్రత్యేకించి ఇక్కడికి భక్తులు తండోప తన్దలగు వస్తు ఉంటారు . చాల మహిమన్మితమైన క్షేత్రం . గ్రహదోష లు ఉన్న వాళ్ళు తప్పకుండ దర్సిన్చానియమైన స్థలం . శని త్రయోదశి సందర్భంగా తైలబిషేకం నిర్వహిస్తార్రు .





Route Map :-