info.manatemples@mail.com

+91 9866933582

వెంకటేశ్వర స్వామి దేవాలయం -జమలాపురం,ఖమ్మం జిల్లా


"కలౌ వెంకట నాయక " అని స్తుతించాబడు కల్యానధాముడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయముగా సాలగ్రామ శీలరుపమన వెలసిన పరమ పవిత్ర దివ్య క్షేత్రం . తెలంగాణా తిరుపతి గ పిలిచే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఖమ్మ జిల్లా జమలాపురం గ్రామం ( సుమారు 80+ కం ఖమ్మం నుండి ) లో ఉంది . చాల పురాతనమైన దేవాలయం.


జాబిలి మహర్షి తన శిస్సులతో కలసి సూచికొండ (సుచిగిరి ) మీద కొంత కాలం ఉన్నాడట . అప్పుడా కొండమీద రెండు గుహలు నిర్మించి ఒక దానిని వైకుంట గుహ ,మరొకదానికి ఖైలష గుహ అనే వాళ్ళు అట. మహర్షి కటోర తపస్సు కు మెచ్చి స్వామి ప్రత్యక్షమవ్వగా అప్పుడు మహర్షి ఇక్కడే కొలువై ఉంది ప్రజల కష్ట నష్టాలను తీర్చమని వేడుకోగా స్వామి వారు ఇక్కడే గుహలో ఉండిపోయారు అని స్థల పురాణం .


ఈ క్షేత్రం లో ఉన్న పుష్కరాని లో స్నానం చేస్తే సకల పాపాలు తొలిగిపోతాయని నమ్మకమ్. కాకతీయ రాజుల్లో ప్రసిడ్డుడైన ప్రతాపరుద్ర దేవుడు తన జైత్రయాత్ర సందర్భంగా ఓరుగల్లు నుండి ఖమ్మం మీదుగా కనిగిరి దుర్గమునందు విడిది చేసి అచ్చట ఒక కోటను , భావిని , శివకేశవుల దేవాలయమును నిర్మించెను .అటు నుండి జమలవాయు దుర్గామునకు వెళ్లి జాబిల్లి మహర్షి ప్రతిష్టితమైన పుష్కరనిని బాగుచేయించి ,దేవాలయమును పునరుద్దరించి సదాశివుని గుట్ట పై ఈశ్వరుని ప్రతిష్టించి కోటను నిర్మించారు అని శాసానాలు చెబుతున్నాయి . తిరిగి శ్రీ కకృష్ణ దేవరాలయ కాలం లో దేవాలయం మరమత్తులు నిర్వహించబడ్డాయి .


స్వామి వారి మహాభక్తుడి కోరిక పైన స్వామి వారు గుట్ట నుండి కిందకు వచ్చి వెలిసారు అట . ఇది విజయ స్థానం . శివకేశవులు ఇద్దరు నిలబడి అర్జుననకు పాశుపతాస్త్రం ఇచ్చినట్టి హరిహర స్థానం .




కోరిన కోరికలు తీర్చి భక్తుల కొంగు బంగారమై నిత్యకళ్యాణం ,పచ్చతోరనముగా సకల వైభవములతో వేలుగొంద్తున్నాడు .








వెళ్ళే మార్గం : ఖమ్మం నుండి సుమారు 80 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంటుంది

Route Map:-