info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం -మన్యంకొండ




మహబూబ్ నగర పట్టణానికి 20 కి మీ దూరం లో మన్యం కొండ గుట్ట పైన వెలసిన ప్రసిద్ద వెంకటేశ్వర క్షేత్రం ఇది . పూర్వము ఈ కొండల పైన మునులు స్వామి కోసం తపస్సు చేసారని అందువల్ల దీనికి మునుల కొండ అని పేరు ఉండేది, కాల క్రమేనా అది మన్యం కొండ గ మారింది అని చరిత్ర చెప్తుంది .


మన్యం కొండ చుట్ట ప్రక్కల అనేక కొండాలు పర్వతాలు ఉన్నాయి . కొండల్లో మణులు,పగడాలు దాల్చిన సర్పాలు ఉన్నందున దిన్ని ఒకాప్పుడు నాగ లోకంగా పిలిచేవారు అని అని పెద్దలు చెప్తుంటారు . స్వామి వారు వెలసిన గుహ కూడా పాము పడుగా రూపం లో ఉంటుంది .


మాఘ మాసం లో ఇక్కడ స్వామి వారి బ్రహ్మోత్సవాలు కనుల పండుగ గ జరుగుతాయి . స్వామి వారి ఆలయం లో వీరభద్ర స్వామి కూడా కొలువై ఉన్నాడు . భాద్రపద మాసం లో వీరభద్ర స్వామి వారి అగ్నిగుండం ఉత్సవాలు ఘనంగా జరుగుతయి. తిరుపతి లో స్వామి వారు ఏడు కొండల పై వేలియగా ఇక్కడ స్వామి వారు మూడు కొండల పై వెలిసాడు ..


కొండ దిగువన అలివేలు మంగమ్మ వారి దేవాలయం ఉంది స్వామి వారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు అమ్మవారిని కూడా దర్శించుకుంటారు .
వెళ్ళు మార్గం
హైదరాబాద్ నుండి నారాయణపేట ,రాయచూరు వెళ్ళే బస్ లు మన్యం కొండ దిగువ బాగం నుండి వెళ్తాయి.
హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వెళ్లి అక్కడి నుండి ఈ ప్రాంతాన్ని చేరుకోవొచ్చు
Route Map :-