info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం -దేవుని కడప




శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం కడప పట్టణానికి 2 కి మీ దూరం లో ఉన్నది . పూర్వం తిరుపతికి వెళ్ళే యాత్రికులకు మార్గం ఇదే . దేవుని కడపలో వెలసిఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుల దర్శనంతారమే తిరుమలేశుని దర్శించుకోవడం సంప్రదాయంగా పాటించబడుతుండేది . ఈ క్షేత్రాన్ని తిరుమల తొలి గడప అని పిలిచేవారు.


దేవుని కడప లో కృపచార్యులు ఇచ్చటి వేంకటేశ్వరుని ప్రతిష్టించినట్లు ప్రతీతి . తిరుమల వరహక్షెత్రమైథె కడప హనుమత్ క్షేత్రం . ఇచ్చటి వెంకటేశ్వర స్వామి వేనుకబాగన ఆంజనేయ విగ్రహం ఉంది . ఈ క్షేత్రాన్ని క్రిపవతి క్షేత్రం అని పిలిచేవారు అని పురాణాలూ చెబుతున్నాయి . ఈ క్షేత్రానికి హనుమాన్ క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు . .


విశాలమైన ఈ ఈ అలయంనందు అద్బుతమైన శిల్పకళ,ముఖ మండపం రమణీయంగా ఉంటాయి. శ్రీ కృష్ణ దేవరాయల కాలం లో దేవాలయం ఎంతో అభిరుద్ది చెందింది గ శాసనాల ద్వారా తెలుస్తుంది. దేవాలయ ప్రాంగణం లో చాల ఉపాలయాలు ఉన్నాయి .


ఈ క్షేత్రాన్ని తాళ్ళపాక అన్నమ చార్యులు ,శంకర చార్యులు చాలాసార్లు దర్సిన్చారట.స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి. ప్రతి ఒక్క్కరు చూసి తరించాల్సిందే !!






Route Map