info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం( తిమ్మప్ప దేవాలయం ) –మల్దకల్




గద్వాల్ పట్టణానికి 18 కి మీ దూరం లో మల్దకల్ గ్రామంలో వెలసిన ఈ క్షేత్రాన్ని తిమ్మప్ప దేవాలయం అని కూడా అంటారు .


స్థల పురాణం :-
----------------
గద్వాల సంస్థానాన్ని పరిపాలించే నలసోమ భూపాలుడు ఒక రోజు అరణ్యానికి వెళ్తుండగా గుర్రం ఈ ప్రాంతం లోకి రాగానే నిలబడిపోయింది ఎంతకు కదలకపోతే ఇక్కడ ఏదో మహత్యం ఉంది అని గ్రహించిన భూపాలుడు గుర్రం దిగేసి చుట్ట పక్కల వెతకడం మొదలెట్టాడు.దురమ్ లో పశువల కాపరి కనిపించగా ఇక్కడ ఏదైనా ప్రత్యేకత ఉండ అని ఆదిగాగ ..చేట్ల పొదలలో స్వామి వారి విగ్రహాన్ని చూపించాడు అని ..తరువాత స్వామి వారు అతని స్వపన్మ్ లో కనిపించి ఆలయాన్ని నిర్మించామన్నాడు అని ఆ తరువత భుపలడు ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం . అంతే కాకా పశువుల కాపరినే అర్చకుడిగా భూపాలుడు నియమించాడని చెబుతారు . అందుకనే నేటికీ బోయ వంశస్థులే ఈ ఆలయంలో పూజారులుగా వ్యవహరిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది.


ప్రతి ఏట మార్గశిర మాసం లో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ గ జరుగుతాయి . 15 రోజుల పాటు జరిగే జాతరలు కొన్ని లక్షల మంది భక్తులు పాల్గుంటారు .


స్వామి పుష్కరాని, విజయతీర్తం, రామతీర్థం ,శేసదసుల బృందం వంటివి ఈ ఊరులో చూడదగినవి . సమీపం లోని ఆదిచిన్తలముని ఆలయం లో ఒకే రాతికి చెక్కిన 18 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం,16 అడుగుల లక్ష్మి దేవి విగ్రహం ప్రతేయ్క ఆకర్షణగా నిలుస్తాయి . ఏకశిలా తో రూపొందించిన అనంతసయనముర్తి ,శ్రీదేవి ,భూదేవి ,ఆంజనేయుడు , శివుడి విగ్రహాలు చూడదగినవి . మల్దకల్ లో సతి సమేత నవగ్రహాల విగ్రహాలు ఉన్నాయి .


ఇది ఆదిశీల క్షేత్రం కృష్ణ ,తుంగభద్రా నదుల మద్యన వెలియడం విశ్సేం. అది అనగా కన్నడ బాష లో మొదలు ,కల్లు అనగా రాయి అని అర్థం .మొదలుకల్లు రాను రాను మల్దకల్ గ రూపాంతరం చెందింది. ఈ క్షేత్ర ప్రాముక్యత గురుంచి బ్రహ్మాండ పురాణం లో వివరించడం జరిగింది . ఇక్కడ శ్రీనివాసుడు స్వయం భువు డై క్షేత్రముర్హ్తి గ శివుడు కావడం విశేషం ... ప్రతి ఒక్కరు తప్పకుండ చూడదగ్గ మహిమన్మితమైన క్షేత్రం


మహబూబ్నగర్ జిల్లాలో పేరెన్నికగన్న జాతరలలో మల్దకల్, కురుమూర్తి జాతరలు మంచి గుర్తింపు కలిగి ఉన్నాయి. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన తిమ్మప్ప ప్రముఖ పుణ్యస్థలంగా గుర్తించి, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది . ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే.. అయిజ, గద్వాల రోడ్డు మధ్యన గద్వాలకు 18 కిలోమీటర్ల దూరంలో మల్దకల్ ఆదిశిలా క్షేత్రం వెలిసింది. ఈ ఆలయం చేరుకునేందుకు గద్వాల, ఎమ్మిగ నూర్, రాయచూర్, వనపర్తి, కర్నూల్ డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను నడుపుతోంది.
Route Map:-