వెంకటేశ్వర స్వామి దేవాలయం- ద్వారకా తిరుమల(చిన్న తిరుపతి )
ఏలూరు కి సుమారు 42 కి మీ దూరం లో ఉన్న ద్వారకా తిరుమల లో వెలసిన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో రమణీయంగా ,ఆహాలదకరంగా , శోబయమానంగా ఉంటుంది . పూర్వం ద్వారకుడు అనే మహర్షి కలియుగ దైవం వేంకటేశ్వరుని గురుంచి ఘోరమైన తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్న ప్రాంతం కనుక ద్వారకా తిరుమలగ పేరు ఏర్పడింది . మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు తన పాదములను మహర్షికి ఇచ్చారట .
త్రేతా యుగం లో ఈ క్షేత్రాన్ని శ్రీ రామ చంద్రుని పీతమహుడైన అజమహారాజు , తండ్రి ఆయన దశరథ మాహారాజు సేవిన్చుకున్నారు అని పురాణాలూ వివరిస్తున్నాయి . ఇచ్చట స్వయంవక్తుడైన శ్రీనివాస మూర్తి పాదాలు అధ: కాయం పుట్టలో ఉండుటచే ఈ క్షేత్రం లో స్వామిని సేవించుకునే భక్తులకు పాదపూజ లబించుటకై పుర్వమేప్పుడో సర్వాంగ సంపుర్ణమఘు శీలా విగ్రహాన్ని ఆగమ శాస్త్రనుసారంగా ధ్రువముర్థికి వెనుక బాగం లో పీటం పై ప్రతిష్టించారు. ఇలా ఒకే వీమానమందు ఇద్దరు ద్రువముర్తులు ఉండటం ఈ క్షేత్రం యెక్క మరో విశేషం .
ఇక్కడ స్వామి వారు దక్షినబిముకులై ఉంటారు . ఈ స్వామి వారి సన్నిధికి కుడివైపు అలివేలు మంగతాయారు, ఆండల్ అమ్మవార్ల ఆలయములు తూర్పు ముఖంగా వీరసిల్ల్లుతున్నాయి ..శుక్రవారాల్లో అమ్మవార్లకు విశేష పూజలు జరుగుతాయి .
స్వామి వారి ఆలయమునకు తూర్పువైపున యాగశాల , వాహనశాల ,మహానివేధన శాల మొదలగునవి ఉంటాయి. ఈ ఆలయం చుట్టూ పన్నిద్దరు ఆళ్వారులకు వేరు వేరుగా ఆలయములు ఉన్నాయి. ప్రాకారం నందు నాలుగు దిక్కులా నాలుగు గాలిగోపురాలు ఉన్నాయి. ఆలయానికి బయట పడమట వైపు కల్యాణకట్ట కలదు .
Route Map : -