శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -భీమగల్
లింబాద్రి గుట్ట ( నింబా చాల ) క్షేత్రం నిజామాబాదు జిల్లాలోని భీమగల్ పట్టణానికి 5 కి మీ దూరం లో వెలసిన ప్రసిద్ద లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం .
భీమగల్ నుండి 5 కి మీ దూరం లో గల గుట్ట పైన స్వయం భు గ వెలసిన మహిమన్మితమైన క్షేత్రం . బ్రహ్మ వ్యవర్తక పురాణం లో,శ్రీమాన్ నిమ్బాచల మహత్యం లో ఈ క్షేత్రం గురుంచి చెప్పాడం జరిగింది . బ్రహ్మ మరియు ప్రహలదుల కోరిక మేరకు నరసింహ స్వామి ఈ క్షేత్రం లో కొలువై ఉన్నాడు అని స్వామి వారు మహాలక్ష్మి అమ్మ వారిన తన తోడ పైన కుర్చుబెట్టుకొని కనిపిస్తాడు .ఒక గుట్ట పైన స్వామి వారు వెలిశారు.
స్వామి వారి పూజ కార్యక్రమాలు అన్ని మధ్వ సాంప్రదాయం ప్రకారం నిర్వహించాబడుతాయి . ఈ క్షేత్రం లో భక్తులు నియమ నిష్టలతో స్వామి వారిని దర్శించుకోవాలని నియమం కూడా ఉంది .
ఈ కొండ పైన వివిధ దేవా గణాలు అందరు వివిధ రూపాలలో వెలిశారు అని స్థల పురాణం చెబుతుంది . ఈ క్షేత్ర మహత్యం గురుంచి మహర్షి సుత సౌనకది ఋషులకు వివరించడం జరిగింది అని పురాణం గాథ . కప్పుడు కొండ పైన మొత్తం నిమ్బు చెట్లు ఉండేవి అట అందుకే ఈ స్థలాన్ని నిమ్బాచాలా మహత్యం అని కుడా అనేవారు . చాల శక్తి వంతమైన ,మహిమన్మితమైన క్షేత్రం .ఈ క్షేత్రం లో చింతామణి పుష్కరాని కూడా ఉంది .
స్వామి వారు ఉత్సవ మూర్తుల విగ్రహాలు భీమగల్ పట్టాన కేంద్రం లో గల ఉత్సవ స్వామి దేవాలయం లో గలవు . అన్ని సమయాల్లో వాటిని ఉరేగించడం జరుగుతుంది . స్వామి వారిని దర్శించే ప్రతి ఒక్కరు ఈ ఉత్సవ మూర్తులను దర్శించుకుంటే నే క్షేత్ర దర్శన ప్రాప్తి లబిస్తుంది అని చెబుతారు .
ఈ క్షేత్రం మహత్యం వివరాలు మరి కొన్ని :-
శ్రీ కృష్ణావతారం ముగియగాన శ్రీ కృష్ణుడు యుదిస్ట్రునితో ఈ విదముగా చెప్పను. నేను మరియు అర్జునుడు నారనారాయణ రూపం లో భాద్రినాత్ మరియు బీమచల్ గుట్ట పైన వెలసి ఉంటాము. నువ్వు అక్కడికి వెళ్లి మమ్మల్ని పూజించు అని వివరించడం జరిగింది అని చెబుతారు .
త్రేతా యుగం లో శ్రీ రాముడు ,సీత లక్షమన సమేతంగా ఈ క్షేత్రాన్ని దర్సించాడని ,శ్రీ రామును అజ్ఞానుసారంగా హనుమ ఇక్కడ తప్పస్సు చేయడం జరిగింది అని స్వామి వారి అజ్ఞానుసరంగా ఇక్కడ కొలువై ఉన్నాడు.
పరమ శివుడు బ్రమ్హ హత్య పతకం తరువాత ఇక్కడ వచ్చి తన దోషము పోగొట్టుకున్నాడు అని స్వామి వారి కోరిక మేరకు జోడులింగాలు అయి ఇక్కడ కొలువై ఉన్నాడు . బ్రమ్హ దేవుడు కూడా ఇక్కడ తన దోష పరిహారార్థం కొరకు ఇక్కడ ఉన్నాడు అని స్థల పురాణం జేబుతుంది .
ఇక్కడ ఉన్న పుష్కర్నిని కమలా పుష్కరిణి అని కూడా పిలుస్తారు . నారసింహ ఆవతార సమయం లో శ్రీ మహాలక్ష్మి అమ్మ వారు స్వామి వారి కోపం,అగ్రహ,ఆవేశాలను చూడలేక కొద్దిసేపు పుష్కరిణి లో కమలాకరం లో కొలువై ఉన్నారు అట అందుకే పుష్కరిణి కి కమలా పుష్కరిణి అని కూడా పిలుస్తారు
బ్రమ్హ అజ్ఞానుసారంగా యమదర్మ రాజు ఇక్కడ తపస్సు చేసాడట .ఆ తరువాత స్వామి వారి కోరిక పైన గుట్ట పైన బిల్వారుక్షం ( పత్రి రుక్షం) రుపంల్ లో కొలువై ఉన్నాడట . అందుకీ ఇక్కడ స్వామి వారికి ఆ పత్రి లతో పూజ చేయడం జరుగుతుంది . శ్రీ మహా విష్ణువు కి ఎక్కడ పత్రి ల తో పూజ చేయడం జరగదు .
వెళ్ళు మార్గం :-
నిజామాబాదు జిల్లాలోని భీమగల్ పట్టణానికి 5 కి మీ దూరం లో
How to Reach :-
From Hyderabad: From Hyderabad the temple town Bheemgal is 200 Kmts away. It is towards Nagpur. One has to take N.H.7 towards Nagpur. Crossing Kamareddy and Dichpally and Armoor. At Armoor there is a diversion from N.H - 7 to right side. From here the temple town is 25 kmts away. Journey is of 5 hrs from Hyderabad.
From Nizamabad: From the district head quarters, it is 50 kmts away. Journey is of 75 minutes. There are no. of busses from Hyderabad to Bheemgal. Also direct busses are there from Hyderabad, Nizamabad, Armoor, Kamareddy, Basar, Kammarpally, Deglur.
From the temple town of Bheemgal: There are busses, jeeps, autos that continuously fly towards the hill temple. Up to Nizamabad there is train facility which is connected with Hyderabad and Maharashtra tracks.